KCR: రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని..
నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. కాగా.. ఈ రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.
నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. కాగా.. ఈ రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు.
నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.…
— BRS Party (@BRSparty) December 25, 2023
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటున్నారు. కాగా.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవ సోదరసోదరీమణులు పండుగలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని కేసీఆర్ అన్నారు. శాంతి సౌభ్రాతృత్వం కరుణ క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని కేసీఆర్ ప్రార్థించారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సదా స్మరణీయం.. ఆచరణీయం.. అంటూ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..