Christmas: ఈ దేశాలలో క్రిస్మస్ జరుపుకోరు.. మరికొన్ని దేశాలు పబ్లిక్ హాలిడేగా గురించలేదు .. అవి ఏమిటంటే..

కొన్ని రోజుల ముందుగానే క్రిస్మస్ జరుపుకోవడానికి సిద్ధమవుతారు. డిసెంబర్ 25వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండుగకు పబ్లిక్ హాలీడేగా ప్రకటిస్తారు కూడా. ఏసు ప్రభువు పుట్టిన రోజైన క్రిస్మస్ ను పిల్లల నుంచి పెద్దల్లో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. క్రైస్తవులే కాకుండా ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో పాల్గొంటారు. ఈ రోజున బహుమతులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజు పిల్లలకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే చిన్నారులు శాంతాక్లాజ్ నుంచి గిఫ్ట్స్ అందుకుంటారు. అయితే క్రిస్మస్ జరుపుకోని కొన్ని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా..

Christmas: ఈ దేశాలలో క్రిస్మస్ జరుపుకోరు.. మరికొన్ని దేశాలు పబ్లిక్ హాలిడేగా గురించలేదు .. అవి ఏమిటంటే..
Christmas Festival
Follow us

|

Updated on: Dec 25, 2023 | 12:21 PM

క్రిస్మస్ క్రిస్టియన్ మతస్థులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజున ఏసు ప్రభువు జన్మించాడని నమ్ముతారు. ఈ రోజున ప్రజలు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు  ప్రియమైన వారితో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటారు. కొన్ని రోజుల ముందుగానే క్రిస్మస్ జరుపుకోవడానికి సిద్ధమవుతారు. డిసెంబర్ 25వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండుగకు పబ్లిక్ హాలీడేగా ప్రకటిస్తారు కూడా.

ఏసు ప్రభువు పుట్టిన రోజైన క్రిస్మస్ ను పిల్లల నుంచి పెద్దల్లో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. క్రైస్తవులే కాకుండా ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో పాల్గొంటారు. ఈ రోజున బహుమతులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజు పిల్లలకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే చిన్నారులు శాంతాక్లాజ్ నుంచి గిఫ్ట్స్ అందుకుంటారు. అయితే క్రిస్మస్ జరుపుకోని కొన్ని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా.. !

ఆఫ్ఘనిస్తాన్: సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా సంవత్సరాలుగా క్రిస్మస్ పండుగ జరుపుకోవడం లేదు. ఇక్కడ ప్రజలు క్రైస్తవుల పండుగ క్రిస్మస్‌ను మతపరమైన భావాల కారణంగా జరుపుకోరు.

ఇవి కూడా చదవండి

ఇరాన్: క్రిస్మస్ జరుపుకోని దేశాల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. అందులో ఇస్లామిక్ దేశం ఇరాన్ కూడా ఉంది. సమాచారం ప్రకారం ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడంపై నిషేధం ఉంది.

భూటాన్: మన పొరుగు దేశం భూటాన్‌లో కూడా క్రిస్మస్ రోజుకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ఈ పండుగ ఇక్కడ క్యాలెండర్‌లో భాగం కాదు. ఇక్కడి జనాభాలో 75 శాతం మంది బౌద్ధమతాన్ని విశ్వసిస్తున్నారు. అంచనాల ప్రకారం భూటాన్‌లోని జనాభాలో కేవలం 1 శాతం మాత్రమే క్రైస్తవ మతానికి చెందినవారు.

సోమాలియా: సోమాలియాలో కూడా క్రిస్మస్ వేడుకలపై నిషేధం ఉంది. మతపరమైన మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పర్యాటకులు తమ ఇళ్లలోనే జరుపుకోవాలి..  పండుగను బహిరంగంగా క్రిస్మస్ ను జరుపుకోవడంపై నిషేధం ఉంది.

పాకిస్తాన్: డిసెంబర్ 25 పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా జన్మదినం అయినందున, పాకిస్తాన్‌లో కూడా క్రిస్మస్ జరుపుకోరు. అయినప్పటికీ ఇక్కడ ప్రజలకు ఈ రోజు పబ్లిక్ హాలీడే.

ఈ దేశాలతో పాటు ఉత్తర కొరియా , లిబియా , మౌరిటానియా , సహ్రావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ , సౌదీ అరేబియా ,  తజికిస్తాన్ , ట్యునీషియా , తుర్క్ మెనిస్తాన్ , ఉజ్బెకిస్తాన్ యెమన్ వంటి దేశాలు క్రిస్మస్ పండుగను ప్రభుత్వ సెలవు దినంగా గుర్తించలేదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..