AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: డాక్టర్లను సైతం కంగుతినిపించిన గర్భిణీ .. రెండు రోజుల్లో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. 

ఈ కేసు అమెరికాలోని అలబామాకు చెందినది. మహిళ పేరు కెల్సీ హాట్చర్. స్కై న్యూస్ నివేదిక ప్రకారం ఆ స్త్రీకి ఒకటి కాదు రెండు గర్భాశయాలు ఉన్నాయి. అయితే సాధారణంగా ఏ స్త్రీకైనా ఒక గర్భాశయం మాత్రమే ఉంటుంది. అయితే ఈ మహిళకు అరుదైన రెండు గర్భాశయాలున్నాయి. ఈ కారణంగానే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడానికి రెండు రోజులు పట్టింది.

Viral News: డాక్టర్లను సైతం కంగుతినిపించిన గర్భిణీ .. రెండు రోజుల్లో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. 
Us Woman Alabama
Surya Kala
|

Updated on: Dec 25, 2023 | 11:23 AM

Share

కవలలు పుట్టడం కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా తరచుగా కవల పుడుతునే ఉన్నారు. అయితే కొన్నిసార్లు మహిళలు ఒకేసారి 8-10 మంది పిల్లలకు జన్మనిచ్చిన సంఘటనలు వింటూనే ఉన్నాం. అయితే అరుదుగా ఇటువంటి సందర్భాలు కనిపిస్తాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో మహిళలు కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల వ్యవధిలో కవల పిల్లలకు జన్మనిచ్చే సంఘటనలు జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఒక షాకింగ్ ఉదంతం వార్తల్లోకి వచ్చింది. ఇది ప్రజలతో పాటు వైద్యులను కూడా ఆశ్చర్యపరిచింది. ఓ మహిళ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అంతే కాదు ఆ మహిళకు సంబంధించిన కథ కూడా ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ కేసు అమెరికాలోని అలబామాకు చెందినది. మహిళ పేరు కెల్సీ హాట్చర్. స్కై న్యూస్ నివేదిక ప్రకారం ఆ స్త్రీకి ఒకటి కాదు రెండు గర్భాశయాలు ఉన్నాయి. అయితే సాధారణంగా ఏ స్త్రీకైనా ఒక గర్భాశయం మాత్రమే ఉంటుంది. అయితే ఈ మహిళకు అరుదైన రెండు గర్భాశయాలున్నాయి. ఈ కారణంగానే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడానికి రెండు రోజులు పట్టింది.

రెండు రోజుల్లో ఇద్దరు పిల్లలకు జన్మ

నివేదికల ప్రకారం రెండు గర్భాలు వేరు వేరుగా గర్భం దాల్చింది. ఇలాంటి ఘటన ప్రతి 10 లక్షలకు ఒకటి అని వైద్యులు తెలిపారు. 20 గంటల ప్రసవ తర్వాత అలబామాలోని ఓ ఆసుపత్రిలో కెల్సీ ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది. ఈ బాలికల్లో ఒకరైన రాక్సీ మంగళవారం సాయంత్రం జన్మించగా..మరో బాలిక రెబెల్ సుమారు 10 గంటల తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం జన్మించింది. కెల్సీ ఇదే విషయంపై మాట్లాడుతూ.. తాను కలలో కూడా ఇలాంటి జననాలు ఊహించలేదని.. ఎలాంటి ప్లాన్ చెయ్యలేదని చెప్పింది. తమకు ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిలిద్దరినీ సురక్షితంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావాలనేది తమ కల అని ప్రస్తుతం ఇద్దరు అమ్మాయిలు సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లి

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కెల్సీ ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లి. అయితే ఆమె ఇంతకు ముందు రెండు గర్భాల నుండి గర్భవతి కాలేదు. ఇప్పటి ప్రెగ్నెన్సీ చాలా అరుదైనదని హైరిస్క్ కేస్ అని వైద్యులు చెప్పారు. నివేదికల ప్రకారం కెల్సీకి కేవలం 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. ఆమె డబుల్ గర్భాశయంతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీనిని ‘యూటెరస్ డిడెల్ఫిస్’ అని కూడా పిలుస్తారు. పుట్టుకతో వచ్చే అరుదైన వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా 0.3 శాతం మంది మహిళలను మాత్రమే ప్రభావితం చేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..