Kaloji University: యూజీ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కౌన్సిలింగ్.. ఏ తేదీల్లో అంటే..
Kaloji University: తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాళోజో నారాయణ రావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది.
Kaloji University: తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాళోజో నారాయణ రావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. అండర్ గ్రాడ్యూయేషన్ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఆయుష్ వైద్య విద్య సీట్ల భర్తీకి సంబంధించి మంగళవారం(ఇవాళ), బుధవారం(రేపు) మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన యూనివర్సిటీ అధికారులు.. అభ్యర్థులు సంబంధిత పత్రాలతో వెబ్ కౌన్సిలింగ్‌కు హాజరవ్వాలని సూచించింది. అయితే, ఆలిండియా కోటా యూజీ ఆయుష్ కోర్సుల్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సిలింగ్‌కు అనర్హులని యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే. కాళోజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీట్లు పొందిన అభ్యర్థులు కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని తేల్చి చెప్పారు.
Also read:
India vs England: టీమిండియా సారథి కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలి