ఓరుగల్లు సాక్షిగా పొలిటికల్ హీట్, రామమందిర విరాళాలపై మాటల యుద్ధం, పరకాల నియోజకవర్గంలో బంద్‌ ప్రశాంతం

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ. అవును, ఈ రెండుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తో భగ్గుమంటోంది. రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కామెంట్స్‌ను నిరసిస్తూ ఆయన ఇంటిపై..

ఓరుగల్లు సాక్షిగా పొలిటికల్ హీట్,  రామమందిర విరాళాలపై మాటల యుద్ధం, పరకాల నియోజకవర్గంలో బంద్‌ ప్రశాంతం
BJP vs TRS
Follow us

|

Updated on: Feb 02, 2021 | 3:27 AM

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ. అవును, ఈ రెండుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తో భగ్గుమంటోంది. రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కామెంట్స్‌ను నిరసిస్తూ ఆయన ఇంటిపై బీజేపీ దాడిచేయడం…తర్వాత బీజేపీ ఆఫీస్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అటాక్‌తో పొలిటికల్‌ టెన్షన్‌ పెరిగిపోయింది. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ నేతలు చందాలు వసూలు చేస్తున్నారని, వాటి లెక్కలు చూపాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి డిమాండ్‌ చేశారు. ఇవి ఓరుగల్లులో రాజకీయ వేడిని రాజేశాయి. బీజేపీ కార్యకర్తలు హన్మకొండలోని ధర్మారెడ్డి ఇంటిపై దాడికి దిగారు. దీంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొంది.

ధర్మారెడ్డి ఇంటితోపాటు బీజేపీ ఆఫీస్‌ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ధర్మారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా పరకాల నియోజకవర్గంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఈ ఘటనపై బీజేపీ నేతలు ఛలో వరంగల్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదన్నారు బీజేపీ ఎంపీ సోయం బాపూరావు. నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీని టార్గెట్‌ చేశారని ఆయన ఆరోపించారు. అయితే- బీజేపీ నేతలు రామమందిరం పేరుతో ఇష్టానుసారంగా చందాలు వసూలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. రాముడిపేరుతో రాక్షస పనులుచేస్తున్నారని మండిపడ్డారు. విరాళాల వసూళ్లపై లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ కేసులో 33 మంది బీజేపీ కార్యకర్తలపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు పోలీసులు. అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌తోపాటు 43 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారినిసెంట్రల్ జైల్‌కి తరలించారు. ఇటు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాయి బీజేపీ శ్రేణులు. దీంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడికి యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.