తెలంగాణలో మోగిన పెద్దబడి గంట, కోవిడ్ జాగ్రత్తలతో పాఠాలు. ఈనెల 15వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభించే ఛాన్స్
కరోనా నేపథ్యంలో లాంగ్ గ్యాప్ తర్వాత తెలంగాణలో పెద్దబడి గంటలు మోగాయి. పది నెలల తర్వాత తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కొవిడ్ రూల్స్ పాటిస్తూ... స్టూడెంట్స్,..
కరోనా నేపథ్యంలో లాంగ్ గ్యాప్ తర్వాత తెలంగాణలో పెద్దబడి గంటలు మోగాయి. పది నెలల తర్వాత తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కొవిడ్ రూల్స్ పాటిస్తూ… స్టూడెంట్స్, టీచర్లు స్కూల్స్‌కు వచ్చారు. దీనికి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి మిగతా క్లాసులను స్టార్ట్ చేయాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులు స్కూళ్లకు వచ్చారు. ఎంట్రీగేట్ వద్దే టీచర్లు వారికి థర్మల్ స్క్రీనింగ్ చేశారు. శానిటైజేషన్ తర్వాత లోపలికి అనుమతించారు. ప్రతీ బెంచ్‌పై ఒకే విద్యార్థి కూర్చునేందుకు పర్మిషన్ ఇచ్చారు. స్కూల్ అసెంబ్లీ, సామూహిక ప్రార్థనలు రద్దు చేశారు. ఒక్కో తరగతి గదిలో కేవలం 20 మందినే కూర్చోబెట్టారు.
స్కూళ్లో మాస్క్, భౌతికదూరం, శానిటైజ్ కంపల్సరీ చేశారు. ప్రాథమికోన్నత, ఉన్నత టీచర్లంతా స్కూల్స్‌కు వచ్చారు. 16 వారాల పాటు క్లాసులు జరగనున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు క్లాసులు ఉంటాయి. అటు -హైదరాబాద్, సికింద్రాబాద్‌లో మాత్రం ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠాలు చెబుతారు. రెండు వారాలు పరిస్థితిని గమనించి, పెద్దగా ఇబ్బందులు రాకపోతే ఈనెల 15వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే మార్చి ఒకటో తేదీ నుంచి మిగతా తరగతులను ప్రారంభించాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది.
ఈ నేపథ్యంలో జిల్లెలగూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థులతో కలిసి ఆమె మధ్యాహ్న భోజనం అక్కడే చేశారు. అటు శివరాంపల్లి ఉన్నతపాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠాలు జరుగుతున్న తీరును – టీచర్లు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్స్‌తోపాటు కాలేజీలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇంటర్, డిగ్రీ, పీజీ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. మాస్క్‌తోపాటు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ మస్ట్ చేశారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.