Hyderabad: నగర రోడ్లపై మళ్లీ చక్కర్లు కొట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు.. మరో రెండు నెలల్లోనే కార్యరూపం..

Double Decker Buses In Hyderabad: ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే చార్మినార్‌, ట్యాంక్‌ బండ్‌, గొల్కొండలతో పాటు డబుల్‌ డెక్కర్‌ బస్సులు కూడా గుర్తొచ్చేవి. గ్రామీణా ప్రాంతాల నుంచి వచ్చే వారు కచ్చితంగా డబుల్‌ డెక్కర్‌ బస్సు ఎక్కి...

Hyderabad: నగర రోడ్లపై మళ్లీ చక్కర్లు కొట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు.. మరో రెండు నెలల్లోనే కార్యరూపం..
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2021 | 7:47 AM

Double Decker Buses In Hyderabad: ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే చార్మినార్‌, ట్యాంక్‌ బండ్‌, గొల్కొండలతో పాటు డబుల్‌ డెక్కర్‌ బస్సులు కూడా గుర్తొచ్చేవి. గ్రామీణా ప్రాంతాల నుంచి వచ్చే వారు కచ్చితంగా డబుల్‌ డెక్కర్‌ బస్సు ఎక్కి పట్టణాన్ని చుట్టేయాలని ఇష్టపడేవారు. కానీ కాలక్రమేనా డబుల్‌ డెక్కర్‌ బస్సులు కనుమరుగయ్యాయి. వీటి స్థానంలో మెట్రో ఎక్స్‌ ప్రెస్‌లు, మెట్రో డిలక్స్‌లు, ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటికీ డబుల్‌ డెక్కర్‌ బస్సులకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే మళ్లీ నగర రోడ్లపై ఈ బస్సులను పరిగెత్తించే పనిలో పడింది ఆర్టీసీ. మరో రెండు నెలల్లో మళ్లీ భాగ్య నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరగనున్నాయి. అయితే గతంలోలా కాకుండా ఇప్పుడు మోడ్రన్‌ లుక్‌లో దర్శనమివ్వనున్నాయి. ఇందులో భాగంగానే బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించారు. ఫిబ్రవరి 18న ప్రీ బిడ్‌ సమావేశాన్ని నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయంలో ఆ సమావేశంలో తయారీదారులకు క్లారిటీ ఇవ్వనున్నారు. మొదట ప్రయోగాత్మకంగా 25 బస్సులు తిప్పాలని ఆర్టీసీ ఆలోచిస్తోంది. ఇక డబుల్‌ డెక్కర్‌ బస్సులను మొదట రూట్‌ నెం.229 (సికింద్రాబాద్‌ – మేడ్చల్‌ ), రూట్‌ నెం.219 (సికింద్రాబాద్‌–పటాన్‌చెరు), రూట్‌ నెం. 218 (కోఠి–పటాన్‌చెరు), రూట్‌ నెం.9ఎక్స్‌ (సీబీఎస్‌–జీడిమెట్ల), రూట్‌ నెం.118 (అఫ్జల్‌గంజ్‌–మెహిదీపట్నం)లతో దుర్గం చెరువుపై కొత్తగా నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి మీదుగా ఓ బస్సును తిప్పనున్నారు.

Also Read: Adilabad Rims: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. ఆసుపత్రి పాలైన 23 మంది మెడికోలు..