Foreign Currency Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు అరెస్టు
Foreign Currency Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. రూ.54 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు..
Foreign Currency Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. రూ.54 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికుల వద్ద ఈ నగదును అధికారులు గుర్తించారు. ఇక్కడ నుంచి నగదును దుబాయ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
కాగా, విమానాశ్రయంలో బంగారం, డబ్బులు, డ్రగ్స్ తదితరాలు ప్రతి రోజు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇలంటి వాటిపై కస్టమ్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీలు చేపడుతున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం దిగుమతి చేసుకోవడం, గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్‌ను సరఫరా చేస్తుండటంతో కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికపోతున్నారు.