Warangal: కరోనా బాధితులకు చికిత్సనందిస్తూ మహమ్మారి బారిన పడుతున్న వైద్య బృందం.. తెలంగాణాలో భారీగా మెడికోలకు పాజిటివ్..
Warangal Corona Virus: కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గాయి.. ఈ మహమ్మారి అదుపులోకి వచ్చింది అనుకుంటున్న వేళ.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గా రూపాంతరం చెంది మానవాళిపై..
Warangal Corona Virus: కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గాయి.. ఈ మహమ్మారి అదుపులోకి వచ్చింది అనుకుంటున్న వేళ.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గా రూపాంతరం చెంది మానవాళిపై మళ్ళీ విరుచుకుపడుతుంది. దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఓ వైపు మళ్ళీ కరోనా బాధితులు పెరుగుతుండడం.. మరోవైపు ఒమిక్రాన్ బాధితులు .. వీరికి చికిత్సనందిస్తూ వైద్యులు, వైద్య బృందం కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణాలో పలు జిల్లలో వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మెడికల్ సిబ్బంది కరోనా బారిన పడగా.. తాజాగా మరో 15 మంది మెడికోలకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో కాకతీయ మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 42కు చేరుకుంది. ఇప్పటికే కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లతో సహా మెడికోలకు కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది. మెడికల్ కాలేజీలో వరుసగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మెడికోలు, ప్రొఫెసర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంజీఎంలో వైద్యసేవలు అందిస్తున్న క్రమంలోనే వారంతా కోవిడ్ బారిన పడ్డారని వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత వారం రోజుల నుండి వరంగల్ కో కోవిడ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది.. ఎంజీఎంలోని కోవిడ్ వార్డుకు కరోనా బాధితులు క్యూ కడుతున్నారు. కరోనా బాధితులకు మెడికల్ స్టూడెంట్స్ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య సేవలను అందిస్తూ.. మెడికోలు కూడా కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన మెడికోలు కోవిడ్ బారిన పడ్డారు.. స్వల్ప లక్షణాలున్న ఎంబిబిఎస్ విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.. ఇప్పటికే పలువురికి పాజిటివ్ రిజల్ట్ రాగా.. తాజాగా మరో 15 మందికి కోవిడ్ పాజిటీవ్ నిర్దారణ అయింది.. ఈ నేపథ్యంలో వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గత వారం రోజుల నుంచి వైద్య సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడడంతో తోటి మెడికలో, పీజీ డాక్టర్లు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.
రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగిపోతున్నాయి. దీంతో బాధితులకు కరోన వైద్యం అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో 12 మంది , ఉస్మానియా ఆసుపత్రి లో 27మంది, నిలోఫర్ ఆసుపత్రి లో ఇద్దరు, ఈ ఎన్ టీ ఆసుపత్రిలో 7 మంది వైద్య సిబ్బంది తాజాగా కరోనా పాజిటి గా నిర్ధారణ అయ్యారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఈ మధ్యే 8మంది వైద్య సిబ్బంది కరోనా సోకింది. దీంతో వీరందరినీ ఐసోలేషణ్ లో ఉంచి చికిత్సనందిస్తున్నారు.
Also Read: