TS Corona: తెలంగాణలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికం..

తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,825 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే నిన్నటితో పోలిస్తే..

TS Corona: తెలంగాణలో మళ్లీ పెరిగిన కోవిడ్  కేసులు.. జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికం..
Corona
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 10, 2022 | 10:18 PM

Telangana Covid 19 Cases: దేశంపై కోవిడ్ మరోసారి పంజా విసిరింది. కేసుల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయింది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.. కొత్త కేసుల కారణంగా క్రియాశీల కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదవుతోంది. దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరగ్గా.. వీక్లీ పాజిటివిటీ రేటు 6.77 శాతానికి చేరింది.

తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,825 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే నిన్నటితో పోలిస్తే.. 152 క‌రోనా కేసులు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,825 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని వైద్యారోగ్య శాఖ అధికారులు బులెటిన్‌లో వెల్లడించారు. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనాతో ఒక‌రు మృతి చెందారు. ఇక వైరస్ బారి నుంచి 350 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 14,995 ఐసోలేషన్, యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 70,697 శాంపిల్స్‌ను ప‌రీక్షించినట్లు బులెటిన్‌లో తెలిపారు. కాగా తాజా కేసుల్లో 1042 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఇక మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 201, రంగారెడ్డి జిల్లాలో 147, సంగారెడ్డి జిల్లాలో 51 కేసులు రికార్డయ్యాయి. గత మూడ్రోజులుగా ఒమిక్రాన్ కొత్త కేసులపై వైద్యారోగ్య శాఖ ఏ ప్రకటన చేయలేదు. క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో ప్రజల్లో, అధికారుల్లో ఆందోళ‌న నెల‌కొంది.

అయితే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈనెల 20 వ‌ర‌కు పెంచ‌డంతో రోజువారీ కేసుల సంఖ్య కాస్త త‌గ్గే అవ‌కాశం కనిపిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధ‌న‌లు పాటిస్తే కేసుల సంఖ్యను అదుపులో ఉండే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాగా.. దేశంలో థర్డ్‌వేవ్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ పార్టీ నాయకులకు, దేశంలోని ప్రముఖులను తాకింది.  దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయింది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. సోమవారం  ఒక్క‌రోజే దేశంలో ల‌క్ష‌న్న‌ర మందికి పైగా వైర‌స్ బారిన‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..

ఇవి కూడా చదవండి: Punjab Assembly Election 2022: వీటి చుట్టే తిరుగుతున్న పంజాబ్ ఎన్నికలు.. ఆశలన్నీ కింగ్ మేకర్‌పైనే..

Flamingos: ఫ్లెమింగోలు ఒంటికాలి జపం ఎందుకు చేస్తాయో తెలుసా.. దీని వెనుక ఓ సైన్స్..