Corona: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 3982 పాజిటివ్ కేసులు, 27 మరణాలు…
Corona Positive Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3982 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..
Corona Positive Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3982 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,36,766కి చేరింది. నిన్న 5186 మంది వైరస్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,85,644కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 27 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటిదాకా నమోదైన మరణాల సంఖ్య 3012కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా నమోదైన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 18, భద్రాద్రి కొత్తగూడెం 142, జీహెచ్ఎంసీ 607, జగిత్యాల 86, జనగాం 47, జయశంకర్ భూపాలపల్లి 49, గద్వాల్ 57, కామారెడ్డి 40, కరీంనగర్ 188, ఖమ్మం 247, ఆసిఫాబాద్ 27, మహబూబ్ నగర్ 129, మహబూబాబాద్ 88, మంచిర్యాల 109, మెదక్ 58, మేడ్చల్ 225, ములుగు 49, నాగర్ కర్నూల్ 146, నల్గొండ 139, నారాయణపేట 48, నిర్మల్ 23, నిజామాబాద్ 69, పెద్దపల్లి 133, రాజన్న సిరిసిల్ల 72, రంగారెడ్డి 262, సంగారెడ్డి 114, సిద్ధిపేట 104, సూర్యాపేట 133, వికారాబాద్ 130, వనపర్తి 90, వరంగల్ రూరల్ 129, వరంగల్ అర్బన్ 142, యదాద్రి భోనగిరిలో 82 కేసులు నమోదయ్యాయి.