Telangana Corona: తెలంగాణలో తగ్గిన కరోనా వ్యాప్తి.. వెయ్యికి పడిపోయిన పాజిటీవ్ కేసుల సంఖ్య..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Jun 20, 2021 | 8:34 PM

Telangana Corona: తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఫలితంగా రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య నేడు గణనీయంగా...

Telangana Corona: తెలంగాణలో తగ్గిన కరోనా వ్యాప్తి.. వెయ్యికి పడిపోయిన పాజిటీవ్ కేసుల సంఖ్య..
Covid 19 Telangana
Follow us

Telangana Corona: తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఫలితంగా రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య నేడు గణనీయంగా పడిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 87,854 మంది నుంచి సాంపిల్స్ సేకరించి టెస్ట్‌ నిర్వహించగా.. 1,006 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక 1,798 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది కరోనా వైరస్ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,765 యాక్టీవ్ కేసులు ఉండగా.. వీరిలో కొంతమంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో రికవరీల రేటు 96.52 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతం ఉంది. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారిన సంఖ్య 6,13,202 లకు చేరింది. వీరిలో 5,91,870 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3,567 మంది ప్రాణాలు కోల్పోయారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు అయ్యాయి. ఇంకా జిల్లాల్లో కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 0, బద్రాద్రి కొత్తగూడెం – 51, జీహెచ్ఎంసీ – 141, జగిత్యాల – 17, జనగామ – 12, జయశంకర్ భూపాలపల్లి – 11, జోగులాంబ గద్వాల – 10, కామారెడ్డి – 4, కరీంనగర్ – 62, ఖమ్మం – 88, కొమరంభీం ఆసిఫాబాద్ – 3, మహబూబ్‌నగర్ – 21, మహబూబాబాద్ – 28, మంచిర్యాల – 26, మెదక్ – 9, మేడ్చల్ మల్కాజిగిరి – 58, ములుగు – 8, నాగర్ కర్నూల్ – 13, నల్లగొండ – 64, నారాయణ పేట – 5, నిర్మల్ – 0, నిజామాబాద్ – 9, పెద్దపల్లి – 27, రాజన్న సిరిసిల్ల – 21, రంగారెడ్డి – 79, సంగారెడ్డి – 18, సిద్దిపేట – 34, సూర్యాపేట – 68, వికారాబాద్ – 16, వనపర్తి – 29, వరంగల్ రూరల్ – 17, వరంగల్ అర్బన్ – 41, యాదాద్రి భువనగిరి – 17 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇదిలాఉంటే.. కరోనా సెకండ్ ప్రారంభమైన తరువాత తొలిసారి రాష్ట్రంలో పలు జిల్లాలో సున్నా పాజిటివ్ రేట్ నమోదు అయ్యింది. అందులో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఇవాళ ఒక్క పాజిటివ్ కేసులు కూడా నమోదు అవలేదు.

Also read:

IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ టీమ్.. ఓపెనర్లుగా లాథమ్, డెవాన్ కాన్వే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu