5

Wife and Husband: ఇద్దరు భార్యల ముద్దుల భర్త.. ఎలా పంచుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

Wife and Husband: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వివాహం చేసుకున్న ఓ యువకుడు.. మరో యువతిని...

Wife and Husband: ఇద్దరు భార్యల ముద్దుల భర్త.. ఎలా పంచుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..!
Wife And Husband
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 22, 2021 | 7:42 AM

Wife and Husband: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వివాహం చేసుకున్న ఓ యువకుడు.. మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చివరికి విషయం అందరికీ తెలియడంతో ముగ్గురూ కాంప్రమైజ్ అవడంతో రెండ వివాహం చేసుకున్నాడు. అప్పడే అసలు సమస్య ఎదురైంది. భర్త ఏ భార్య వద్ద ఉండాలనే సందేహం వ్యక్తమవగా… దీనికి 50-50 ఫార్ములాను ప్రయోగించారు. ఒక భార్య వద్ద 3 రోజులు, మరొక భార్య వద్ద 3 రోజులు చొప్పున ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. రాంపూర్‌లోని ధోంక్‌పురి తాండా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అంతకు ముందే వివాహం జరిగింది. అయితే, ఈ వ్యక్తికి అస్సాంకు చెందిన యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ యువతి ప్రేమ కోసం వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి చండీగఢ్ చేరుకున్నాడు. అక్కడ తన ప్రేయసితో కొంతకాలం సహజీవనం చేశాడు. అలా కొంతకాలం తరువాత యువతి గర్భవతి అయి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కంగారు పడిన వ్యక్తి.. తన ప్రేయసిని వదిలి స్వగ్రామానికి పారిపోయి వచ్చాడు.

అది గ్రహించిన ప్రేయసి.. తనను వదిలేసి పారిపోయిన ప్రియుడి కోసం తీవ్రంగా గాలించింది. చివరికి అతని స్వగ్రామాన్ని కనిపెట్టి ఆ ఊరికి చేరుకుంది. తన గోడునంతా గ్రామ పెద్దలకు వివరించింది. పోలీసులకు ఆశ్రయించగా.. వారు కల్పించుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతర పరిణామాల నేపథ్యంలో చివరికి ఆ వ్యక్తి తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూడా చేసేదేమీ లేక ఆ పెళ్లికి అంగీకరించింది. అయితే, పెళ్లి జరిగాక అసలు సమస్య ఉత్పన్నమయ్యింది. భర్త ఎవరి వద్ద ఉండాలనే సమస్య ఉత్పన్నమవగా.. మధ్యవర్తులు 50-50 ఫార్ములాను ఉపయోగించారు. అంటే మొదటి భార్య వద్ద 3 రోజులు, రెండవ భార్య వద్ద 3 రోజులు.. మిగిలిన ఒక రోజు అతని తల్లిదండ్రుల వద్ద ఉండేలా రాజీ కుదుర్చారు. అంటే ఆ లెక్కన.. మొదటి భార్య వద్ద సోమవారం, మంగళవారం, బుధవారం ఉండాలి. రెండవ భార్యతో గురువారం, శుక్రవారం, శనివారం ఉండాలి. ఆదివారాలు మాత్రం ఆ వ్యక్తి తన తల్లిదండ్రులతో ఉండాలని షరతు పెట్టుకున్నారు. ఇలా ఇద్దరు భార్యలు తమ భర్తను పంచుకుని కథను సుఖాంతం చేశారు.

Also read:

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌తో క్రియేటర్లకు పండుగ.. యూజర్లకు తలనొప్పి!

IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ టీమ్.. ఓపెనర్లుగా లాథమ్, డెవాన్ కాన్వే..

TSRTC : తెలుగు రాష్ట్రాలు, కర్నాటక ప్రజలకు గుడ్ న్యూస్..! రేపట్నుంచి రెండు రాష్ట్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్ సర్వీసులు