AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌తో క్రియేటర్లకు పండుగ.. యూజర్లకు తలనొప్పి!

ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌తో కంటెంట్ క్రియేటర్లకు మంచి ఆదాయం అందనుంది. అయితే, ఇదే ఫీచర్ యూజర్లకు మాత్రం తలనొప్పిలా తయారవ్వనుంది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌తో క్రియేటర్లకు పండుగ.. యూజర్లకు తలనొప్పి!
Instagram Reels
Venkata Chari
|

Updated on: Jun 20, 2021 | 7:48 PM

Share

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌తో కంటెంట్ క్రియేటర్లకు మంచి ఆదాయం అందనుంది. అయితే, ఇదే ఫీచర్ యూజర్లకు మాత్రం తలనొప్పిలా తయారవ్వనుంది. టిక్‌టాక్ బ్యాన్‌తో మిగతా సోషల్ మీడియా యాప్స్‌ షార్ట్ వీడియోలపై పడ్డాయి. యూట్యూబ్ షార్ట్స్‌ పేరుతో ఈ రకమైన వీడియోలకు దారి తీయగా, ఇన్‌స్టాగ్రామ్‌ కూడా తన యూజర్ల కోసం రీల్స్‌ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అయితే వీటికి యూజర్ల నుంచి బాగా డిమాండ్‌ పెరగడంతో… ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఆలోచన చేసింది. రీల్స్‌లోనూ యాడ్స్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ లో 30 సెకన్ల పాటు యాడ్స్‌ రానున్నాయి. ఈ ఫీచర్‌ను శుక్రవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ యూజర‍్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ ఫీచర్‌తో కంటెంట్ క్రియేటర్లకు మాత్రం డబుల్ బెనిఫిట్‌గా మారింది.

కంటెంట్ క్రియేటర్లు వీటితో అదనంగా డబ్బు సంపాదించుకోచ్చు. రీల్స్ మధ్యలో వచ్చే యాడ్స్‌తో కంటెంట్ క్రియేటర్లకు బాగా డబ్బు అందనుంది. ఏప్రిల్‌లోనే భారత్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్, జర్మనీల్లో తొలిసారిగా రీల్స్‌లో యాడ్స్ ను పరీక్షించింది. ఇది సక్సెస్ కావటంతో ప్రపంచ వ్యాప్తంగా గత శుక్రవారం నుంచి రీల్స్‌లో యాడ్స్‌ ను ఉంచుతోంది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జస్టీన్‌ ఓసోఫ్స్కీ ఓ ప్రకటన విడుదల చేశాడు. అలాగే యూజర్లు తాము రూపొందించే షార్ట్‌ వీడియోలను ఫేస్‌బుక్‌లో కూడా షేర్‌ చేసుకునే ఆప్షన్‌ను త్వరలో తీసుకొస్తున్నట్లు పేర్కొంది.

Also Read:

Fake Facebook Account : మీ పేరుతో న‌కిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ ఉందా..? డిలీట్‌ చేయండి ఇలా..!

Father’s Day 2021: ‘పాపా మేరే పాపా’ స్టిక్కర్స్‌ను లాంచ్ చేసిన వాట్సప్‌! ఇలా డౌన్‌లోడ్ చేయండి..!