Mi 11 Lite: జూన్‌ 22 న రిలీజ్ కానున్న ఎంఐ 11 లైట్.. ధర ఎంతంటే?

మనదేశంలో ఎంఐ 11 లైట్ జూన్ 22 న లాంచ్ కానుంది. తాజాగా విడుదలకు ముందు షియోమీ ఇండియా సోషల్ మీడియాలో ఎంఐ 11 లైట్ ఫోన్ కలర్ ఆప్షన్లను ఫాలోవర్స్‌తో పంచుకుంది.

Mi 11 Lite: జూన్‌ 22 న రిలీజ్ కానున్న ఎంఐ 11 లైట్.. ధర ఎంతంటే?
Mi 11 Lite
Follow us
Venkata Chari

|

Updated on: Jun 20, 2021 | 8:02 PM

Mi 11 Lite: మనదేశంలో ఎంఐ 11 లైట్ జూన్ 22 న లాంచ్ కానుంది. తాజాగా విడుదలకు ముందు షియోమీ ఇండియా సోషల్ మీడియాలో ఎంఐ 11 లైట్ ఫోన్ కలర్ ఆప్షన్లను ఫాలోవర్స్‌తో పంచుకుంది. అలాగే ఓ షార్ట్ వీడియోను టీజ్ చేసింది. ఎంఐ 11 లైట్ 4జీ, 5జీ వేరియంట్లు ఇప్పటికే కొన్ని దేశాల్లో విడుదలయ్యాయి. అయితే, భారత్‌లో కేవలం 4జీ మోడల్‌ మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జాజ్ బ్లూ, టస్కనీ కోరల్, వినైల్ బ్లాక్ రంగుల్లో ఎంఐ 11 లైట్ అలరించనుంది. ఈ వీడియోలో 3 కలర్ ఆప్షన్లను చూపించారు. వెనకవైపు 3 కెమెరాల సెటప్‌ అందించారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానుంది.

ఎంఐ 11 లైట్ 4జీ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అలాగే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో అందుబాటులోకి రానుందని టెక్ నిపుణులు అంటున్నారు. ఈ ఫోన్ భారత్‌లో రూ.25 వేలలోపు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఎంఐయూఐ 12 ఓఎస్‌తో ఎంఐ 11 లైట్ పనిచేయనుంది. ఈ ఓఎస్‌ను ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా మార్చారు. 6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డీతోపాటు అమోఎల్ఈడీ డిస్ ప్లేను కలిగి ఉంది. 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌ తో రానున్న ఈ ఫోన్‌ లో వెనకవైపు 3 కెమెరాల సెటప్ ఉండనుంది. మెయిన్‌ కెమెరా 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ లు ఉన్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4250 ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదలయ్యే ఈ ఫోన్ 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

Also Read:

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌తో క్రియేటర్లకు పండుగ.. యూజర్లకు తలనొప్పి!

Vivo V21E 5G: వివో నుంచి కొత్త ఫోన్‌..! మనదేశంలో విడుదల ఎప్పుడంటే..?