HCU : 2,328 సీట్లలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ.. వివరాలు:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఈ ఏడాది వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021 - 22 విద్యా సంవత్సరానికి 117 కోర్సుల్లో ప్రవేశానికి 2,328 సీట్లలో ప్రవేశాల కోసం
HCU Notification for Admitions : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఈ ఏడాది వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021 – 22 విద్యా సంవత్సరానికి 117 కోర్సుల్లో ప్రవేశానికి 2,328 సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 20 జూలై 2021. అడ్మిషన్ల కోసం 2021 ఆగస్టు / సెప్టెంబరులో దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
17 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 46 పిజి కోర్సులు, 10 ఎం.టెక్, 44 పిహెచ్‌డి కోర్సులలో జాయిన్ అయ్యేందుకు ఆయా అభ్యర్థులు ఆన్ లైన్ లేదా, ఆఫ్ లైన్ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక, ఎన్‌ఐటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, నిమ్‌సెట్ స్కోర్‌ల ఆధారంగా ఎంసిఎ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ దేశంలోని ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరెన్నికగన్నది.
టీఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు మళ్లీ పొడిగింపు..
కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలతో పాటు పలు సెట్‌లను వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఎంసెట్ 2021 దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 24 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ గురువారం వెల్లడించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ వెల్లడించారు.
కాగా తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జెఎన్‌టీయూ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ పరీక్ష దరఖాస్తు గడువు మే 18న ముగియాల్సి ఉండగా.. ఇప్పటికీ నాలుగుసార్లు పొడిగించగా.. మరలా.. జూన్ 24 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్ ఆధారంగా జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో నిర్వహించనున్నటల్లు అధికారులు అంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే. అగ్రికల్చర్ వారికి 3, ఇంజినీరింగ్ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించనున్నట్లు జెఎన్‌టీయూ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. మరలా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Read also : Metro Rail : తెలంగాణ కొవిడ్ అన్ లాక్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మార్పులు