Father’s Day 2021: ‘పాపా మేరే పాపా’ స్టిక్కర్స్‌ను లాంచ్ చేసిన వాట్సప్! ఇలా డౌన్‌లోడ్ చేయండి..!
వాట్సప్ తన యూజర్ల కోసం ఎల్లప్పుడూ కొత్త ఫీచర్లు, స్టిక్కర్లను అందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఫాదర్స్ డే 2021 (జూన్ 20న) సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకుగాను 'పాపా మేరే పాపా' పేరుతో కొత్త స్టిక్కర్ ప్యాక్ ను విడుదల చేసింది.
Father’s Day 2021: వాట్సప్ తన యూజర్ల కోసం ఎల్లప్పుడూ కొత్త ఫీచర్లు, స్టిక్కర్లను అందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఫాదర్స్ డే 2021 (జూన్ 20న) సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకుగాను ‘పాపా మేరే పాపా’ పేరుతో కొత్త స్టిక్కర్ ప్యాక్ ను విడుదల చేసింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ స్టిక్కర్లు అందుబాటులో ఉన్నాయంటూ పేర్కొంది. హిందీ సినిమా మై ఐసా హీ హూం లోని పాపులర్ పాట పేరుతో ఈ స్టిక్కర్లను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్టిక్కర్ ప్యాక్‌ను పొందాలంటే వాట్సప్‌ను యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ స్టిక్కర్లు లాంచ్ అయ్యాయని వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్, వాబేటా ఇన్ఫో తెలిపాయి. వీటి సైజు 8.3 ఎంబీ ఉంది. ఈ మేరకు అవి ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చాయి. “చెప్పడానికి కష్టంగా అనిపించే కొన్ని విషయాలను తెలియజేసేందుకు ఈ స్టిక్కర్లు సహాయపడతాయని, తండ్రి ప్రేమను గుర్తుచేస్తాయని పేర్కొంది.” వీటితో పాటు లవ్ అండ్ ప్రైడ్, మదర్స్ డే స్టిక్కర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
మరోవైపు ఇప్పటికే డిస్ అప్పీరియంగ్ మెసేజ్ ఆప్షన్ అందించిన వాట్సప్.. త్వరలో 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అయ్యేలా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే వీటితోపాటు ఆర్కైవ్ మెసేజెస్ ఆప్షన్స్‌లోనూ పలు మార్పులు చేసింది. రివ్యూ వాయిస్ మెసేజ్, మల్టీ డివైజ్ సపోర్ట్, న్యూ ఆర్కివ్ లాంటి ఫీచర్లను కూడా తీసుకరానుందంట. ఇవి కూడా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకోవడంలో వాట్సప్ ముందుంటోంది.
డౌన్‌లోడ్ ఇలా.. ముందుగా వాట్సప్ ను అప్ డేట్ చేయాలి. అనంతరం చాట్ విండో ఓపెన్ చేసి, కొత్త స్టిక్కర్ లను బ్రౌజ్ చేయవాలి. ఇందుకోసం స్టిక్కర్స్ మెనులో ప్లస్ గుర్తుపై ప్రెస్ చేయాలి. అప్పుడు కొత్త స్టిక్కర్ ప్యాక్‌లు టాప్‌లో కనిపిస్తాయి. వాటిల్లొంచి మీకు ఇష్టమైనవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఫాదర్స్ డే శుభాకాంక్షలతో స్నేహితులతోపాటు బంధువులను విష్ చేయండి మరి.
Also Read:
Mars Photo: మార్స్‌పై ఫొటో దిగాలనుకుంటున్నారా..? అయితే నాసా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ట్రై చేయండి..
Realme Smartphones: రూ. 15వేల లోపే రెండు ఫోన్లు, స్మార్ట్ టీవీని లాంచ్ చేయనున్న రియల్‌మీ..!