ఢిల్లీలో ఫేక్ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ఇద్దరు డాక్టర్ల అరెస్ట్…..బ్లాకులో అమ్ముతున్న ముఠాతో మిలాఖత్ !

డాక్టర్ అంటే దేవుడితో సమానమని అంటారు. రోగి ప్రాణాలు కాపాడుతారని భావిస్తున్న డాక్టర్లలో కూడా కొందరు అమాయకుల ప్రాణాలతో చెలగామాటమాడే వారు కూడా ఉంటారంటే నమ్మలేం.

ఢిల్లీలో  ఫేక్ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ఇద్దరు డాక్టర్ల అరెస్ట్.....బ్లాకులో అమ్ముతున్న ముఠాతో మిలాఖత్ !
Fake Black Fungus Injection
Umakanth Rao

| Edited By: Phani CH

Jun 20, 2021 | 8:44 PM

డాక్టర్ అంటే దేవుడితో సమానమని అంటారు. రోగి ప్రాణాలు కాపాడుతారని భావిస్తున్న డాక్టర్లలో కూడా కొందరు అమాయకుల ప్రాణాలతో చెలగామాటమాడే వారు కూడా ఉంటారంటే నమ్మలేం. కానీ ఢిల్లీలో ఇద్దరు డాక్టర్ల అరెస్టే ఇందుకు నిదర్శనం. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే లైపోసోమాల్ ఆంఫోటెరెసీ-బీ ఇంజెక్షన్లకు సంబంధించి 3,293 ఫేక్ వైల్స్ ని ఓ వైద్యుని ఇంట్లో పోలీసులు కనుగొన్నారు. సౌత్ ఢిల్లీలోని అల్తామస్ హుసేన్ అనే డాక్టర్ ఇంటిని వారు రైడ్ చేసినప్పుడు ఇవి బయటపడ్డాయి. వీటిలో కొన్ని రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఉండగా కొన్ని ఇప్పటికే కాలం చెల్లినవని పోలీసులు తెలిపారు. మొత్తం 10 మందితో కూడిన ముఠాతో హుసేన్ సహా మరో డాక్టర్ కూడా చేతులు కలిపి ఈ దందాకు పాల్పడుతున్నట్టు తేలింది. ఈ రాకెట్ తో సంబందం ఉన్న ఈ ఇద్దరు వైద్యుల మెడికల్ డిగ్రీలను కూడా వారు పరిశీలించనున్నారు. ఫేక్ ఇంజెక్షన్లపై డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ నుంచి అందిన ఫిర్యాదుతో పోలీసులు ఈ దాడులు జరిపారు.ఈ ఫేక్ మందులను ఈ ముఠా గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్నట్టు కూడా వెల్లడైంది.

ఈ గ్యాంగ్ ఇప్పటికే 400 కి పైగా ఫేక్ ఇంజెక్షన్లను అమ్మినట్టు ఖాకీలు తెలిపారు. కేవలం 250 రూపాయలకు లభించే ఇంజెక్షన్లను వీరు 12 వేలరూపాయల వరకు కూడా బ్లాకులో అమ్మేవారని తెలిసింది. వీరు ఏయే డ్రగ్ స్టోర్లకు..మెడికల్ హాల్స్ కు అమ్మారో.. ఇంకా ఎవరెవరికి అమ్మారో తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. ఈ కేటుగాళ్లను కోర్టులో హాజరు పరచనున్నారు. ఇలాంటివారిని నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్టు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: బ్రిటన్ లో చివరి డైనోసార్ల మనుగడ ! బయట పడిన కాలి ముద్రల శిలాజాలు ! కొనసాగుతున్న పరిశోధనలు

మీరు పాత వాహనాలు నడుపుతున్నారా..? అయితే జాగ్రత్త.. రూ.10 వేలు జరిమానా కట్టాల్సిందే..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu