‘అంకుల్’ పశుపతితో ఇక నేరుగా పోరు…..చిరాగ్ పాశ్వాన్ నిర్ణయం…….త్వరలో బీహార్ లో భారీ రోడ్ షో
లోక్ జన శక్తి పార్టీని తన 'అంకుల్' పశుపతి కుమార్ పరాస్ నుంచి మళ్ళీ తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చిరాగ్ పాశ్వాన్ నేరుగా ఆయనతో తలపడాలనే నిర్ణయించుకున్నారు.
లోక్ జన శక్తి పార్టీని తన ‘అంకుల్’ పశుపతి కుమార్ పరాస్ నుంచి మళ్ళీ తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చిరాగ్ పాశ్వాన్ నేరుగా ఆయనతో తలపడాలనే నిర్ణయించుకున్నారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ పట్ల ఇప్పటికీ అభిమానం చూపేవారితోను, తన మద్దతుదారులు, పార్టీ సభ్యులతోను ఆదివారం ఆయన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే నెలలో రామ్ విలాస్ పాశ్వాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీహార్ లో భారీ ఎత్తున రోడ్ షో ను నిర్వహించి రెబెల్స్ కి తన సత్తా ఏమిటో చూపాలని కూడా అయన నిర్ణయించుకున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ కు ‘భారత ‘రత్న’ పురస్కారాన్ని ప్రకటించాలని కోరుతూ నేటి సమావేశం ముగిసింది. రెబెల్ నేత పశుపతి కుమార్ చర్యలను, ఆయన వ్యాఖ్యలను ఈ మీటింగ్ లో అంతా ఖండించారు. ప్రజలను ఆయన తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చిరాగ్…తనకు, రెబెల్స్ కి మధ్య జరగనున్న పోరాటం ‘ మహాభారతం’ వంటిదన్నారు. తాము పాండవులమైతే..వాళ్ళు కౌరవులని పేర్కొన్నారు.
ఆ కూటమిలో తొమ్మిది మందే ఉన్నారని..కానీ వర్కింగ్ కమిటీ సభ్యుల్లో 90 శాతం మంది తన వెంటే ఉన్నారని ఆయన చెప్పారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా తమ పార్టీ శాఖల అధ్యక్షులంతా తన మద్దతుదారులే అని ఆయన తెలిపారు. త్వరలో జరిగే రోడ్ షో లో మా బలం ఏమిటో ఆ రెబెల్స్ కి చూపుతాం అని ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో తనను వ్యతిరేకిస్తున్న పార్టీల వారు కూడా బెంబేలెత్తడం ఖాయం అని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఢిల్లీలో ఫేక్ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ఇద్దరు డాక్టర్ల అరెస్ట్…..బ్లాకులో అమ్ముతున్న ముఠాతో మిలాఖత్ !