బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబ పూజారిపై పోలీసుల దాడి…….గుడిలోనే ఘర్షణల పర్వం

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబ పూజారి అమిత్ పాండేపై ఆదివారం యూపీలోని వింధ్యాచల్ లో గల వింధ్యవాసిని ఆలయంలో పోలీసులు దాడి చేశారు.

  • Publish Date - 10:09 pm, Sun, 20 June 21 Edited By: Phani CH
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబ పూజారిపై పోలీసుల దాడి.......గుడిలోనే ఘర్షణల  పర్వం
Amitabh Bachchans Family Pr

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబ పూజారి అమిత్ పాండేపై ఆదివారం యూపీలోని వింధ్యాచల్ లో గల వింధ్యవాసిని ఆలయంలో పోలీసులు దాడి చేశారు. ఆయనపై పిడి గుద్దుల వర్షం కురిపించారు. వారికి, ఇతర పూజారులకు మధ్య కూడా ఘర్షణ జరిగి ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇంకా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ.. చాందౌలీ జిల్లా మేజిస్ట్రేట్ తన కుటుంబంతో సహా వచ్చి ఆలయంలో పూజలు చేశారు.దీంతో తాము కూడా పూజలు చేసేందుకు పూజారులు పూనుకోగా పోలీసులు అడ్డు చెప్పారు. ఆ మేజిస్ట్రేట్ కుటుంబాన్ని అనుమతించినప్పుడు తమను ఎందుకు అనుమతించరని పూజారులు వారితో వాగ్యుధానికి దిగారు. ఈ క్రమంలో అప్పుడే అక్కడికి వచ్చిన అమిత్ పాండే బలవంతంగా పూజలు చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణా రహితంగా ఆయనపై చెయ్యి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొందరు పూజారులు స్వల్పంగా గాయపడ్డారు. సుమారు గంటసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇంత జరుగుతున్నా చాందౌలీ జిల్లా మేజిస్ట్రేట్ మౌన ప్రేక్షక పాత్ర వహించారు.

పూజారులపైనా, అమిత్ పాండే పైన ఖాకీల ఎటాక్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తప్పుడు కేసు పెట్టారని అమిత్ పాండే సోదరుడు సుమిత్ పాండే ఆరోపించారు. అయితే తాము ఎవరిపైనా కేసు పెట్టలేదని పోలీసులు అంటున్నారు. అమిత్ పాండే దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. మరి తమ కుటుంబ పూజారి పై పోలీసుల దాడి గురించి అమితాబ్ బచ్చన్ కి తెలుసో…. లేదో తెలియదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వర్షం పడుతుండగా కూతురి ఆన్ లైన్ క్లాసుల కోసం గొడుగు పట్టుకుని నిలబడిన తండ్రి.. ( వీడియో )

Viral Video: కొబ్బరిబోండం తాగుతున్న రంగుల చిలక… నెటిజన్లు ఫిదా.. ( వీడియో )