Telangana: నేడు తెలంగాణ విద్యా సంస్థల సెలవుల పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం..!
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తోంది. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలను..
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తోంది. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా ప్రభావం ముందుగా విద్యాసంస్థలపై పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థల సెలవులను పొడిగించే ఆలోచనలో ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సెలవుల పొడగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే విద్యాసంస్థలకు సెలవులు ఈనెల30 వరకు పొడిగించి ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించేలా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. ఈ విషయమై ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా ప్రకటన చేయనుంది. కోవిడ్ దృష్ట్యా కొద్దిరోజులు ప్రత్యక్ష తరగతులు వద్దని ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ సూచించినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ బాట పట్టిన ప్రయివేటు విద్యా సంస్థలు బీటెక్, ఎంటెక్, ఫార్మసీ విద్యార్థులకు ఈనెల 22 వరకు ఆన్‌లైన్ పాఠాలు చెప్పాలని జేఎన్టీయూహెచ్ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో కరోనా మహమ్మారి చాలాకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా.. మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. గత ఏడాది కరోనా విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూల్స్, కాలేజీలు మూత పడటంతో ఆన్‌లైన్ క్లాసులతో సరిపెట్టుకున్నారు విద్యార్థులు. ఇక తాజాగా రాష్ట్రంలో థర్డ్‌వేవ్ ముంచుకొస్తోంది.
కాగా, రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో ముందుగా విద్యాసంస్థలను 20 వరకు పొడిగించాలని భావించినా.. అలా కాకుండా ఎక్కువ రోజులు పొడిగిస్తే బాగుంటుందని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు వైద్య ఆరోగ్యశాఖ సూచనలు, విద్యాశాఖ సూచనలను పరిగణలోకి తీసుకునే విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై నేడు ప్రకటన చేయనుంది ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి: