Fire Accident: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.20 కోట్ల వరకు ఆస్తినష్టం..!
Fire Accident: అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదవశాత్తు, షార్ట్ సర్క్యూట్ కారణంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణంగా..
Fire Accident: అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదవశాత్తు, షార్ట్ సర్క్యూట్ కారణంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణంగా లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తుంటుంది. ఇక ఆదివారం ఉదయం సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు .రూ 20 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. దీంతో క్లబ్ అంతటా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
జూబ్లీ బస్టాండు సమీపంలో రాకపోకలు నిలిపివేత
వికెండ్ కావడంతో తెల్లవారు జాము వరకూ కార్యక్రమాలు జరిగాయని చెబుతున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతానికి రాకపోకలను నిలిపివేశారు. చుట్టుపక్కల కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
బ్రిటీష్ హయాంలో క్లబ్ నిర్మాణం:
కాగా, 1879లో బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ నిర్మాణం జరిగింది. ఈ క్లబ్ దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్ కవర్ విడుదల చేశారు. సికింద్రాబాద్ క్లబ్‌లో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ క్లబ్‌లో 5వేల మందికి పైగా సభ్యత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: