AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T. Congress: ‘కాంగ్రెస్‌ గ్యారెంటీలను ప్రజలు నమ్ముతున్నారు’.. మ్యానిఫెస్టోలోని హామీలన్నీ నెరవేరుస్తామన్న ఖర్గే..

తెలంగాణలో కాంగ్రెస్‌కు సాహాయపడేందుకు ప్రజలే ముందుకొస్తున్నారు అని ఏసీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంతో విసిగిపోయామని ప్రజలు చెప్తున్నారన్నారు. ఇచ్చిన హామీలేవి బీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. మొదటి రెండునెలలు ఏదో చేశారు.. ఆ తర్వాత పథకాలు ఆపేశారని ఆరోపించారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఇచ్చాం.. తెలంగాణలో కూడా అదే తరహాలో ఇచ్చిన గ్యారెంటీలను ప్రజలు నమ్ముతున్నారు.

T. Congress: 'కాంగ్రెస్‌ గ్యారెంటీలను ప్రజలు నమ్ముతున్నారు'.. మ్యానిఫెస్టోలోని హామీలన్నీ నెరవేరుస్తామన్న ఖర్గే..
Mallikarjun kharge
Srikar T
|

Updated on: Nov 23, 2023 | 4:28 PM

Share

తెలంగాణలో కాంగ్రెస్‌కు సాహాయపడేందుకు ప్రజలే ముందుకొస్తున్నారు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంతో విసిగిపోయామని ప్రజలు చెప్తున్నారన్నారు. ఇచ్చిన హామీలేవి బీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. మొదటి రెండునెలలు ఏదో చేశారు.. ఆ తర్వాత పథకాలు ఆపేశారని ఆరోపించారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఇచ్చాం.. తెలంగాణలో కూడా అదే తరహాలో ఇచ్చిన గ్యారెంటీలను ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్‌ చెప్పిన హామీలు కచ్చితంగా నెరవేర్చుతుందని ప్రజలు నమ్ముతున్నట్లు ఆయన వివరించారు. మా మ్యానిఫెస్టోలో ఏవైతే హామీలు ఇస్తున్నామో వాటిని నెరవేర్చుతామని మరోసారి తెలిపారు. కేసీఆర్‌ది వన్‌మ్యాన్ పార్టీ. కుటుంబసభ్యులే ఆయన్ను ఎన్నుకుంటారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌లో సమిష్ఠి నాయకత్వం ఉంది కనుక.. మేము సమిష్ఠిగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యంగా పనిచేసే వ్యవస్థలో ఆశావహులు ఎక్కువ మందే ఉంటారు. కానీ మా పోరాటం బీఆర్‌ఎస్‌తోనే అని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు బీజేపీతో పాటూ మరిఇంకొందరు మిత్రుల మద్దతు ఉంది. వీళ్లంతా కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో బీసీలను సీఎంగా చేయకుండా బీజేపీని ఎవరు ఆపారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి అధికారం లేదు, ఓటు బ్యాంకూ లేదని చెబుతూ తమ పార్టీ అధికారంలో ఉన్న నలుగురు సీఎంలలో ముగ్గురు బీసీలే అని వివరించారు. బీసీల్లో గందరగోళం సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

ఎంఐఎం, కేసీఆర్‌ మొదటి నుంచి స్నేహితులే అని చెబుతూనే.. వాళ్లిద్దరూ బహిరంగంగా బీజేపీని ఆలింగనం చేసుకుంటున్నారని విమర్శించారు. సెక్యూలర్‌ ఓట్లు, ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్‌తోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంకు రాష్ట్రం మొత్తం బలం ఉంటే.. కేవలం 6-7 సీట్లలోనే ఎందుకు పోటీ చేస్తున్నారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట మాత్రమే ఎంఐఎం పోటీ చేస్తోందని తెలిపారు. కేసీఆర్‌ చేసే ఆరోపణలకు జవాబు చెప్పడానికి మేము ఇక్కడ లేమని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఎంతో మందిని మేము ఎదుర్కొన్నాం..ఇవాళ మా పార్టీకి చెందిన పేపర్‌ ఆస్తులను మోదీ జప్తు చేశారన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ