డిసెంబర్ 3న బీఆర్ఎస్ కరెంట్ కట్.. ఇది రాసిపెట్టుకో: బండి సంజయ్

డిసెంబర్ 3న బీఆర్ఎస్ కరెంట్ కట్ అవుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని ఆయన విమర్శించారు. కరీంనగర్‌ రోడ్‌షోలో పాల్గొన్న బండి సంజయ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తాను ఓటు రూ. 20 వేలు ఇస్తానని మంత్రి గంగుల కమలాకర్ దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

డిసెంబర్ 3న బీఆర్ఎస్ కరెంట్ కట్.. ఇది రాసిపెట్టుకో: బండి సంజయ్
Bandi Sanjay
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 23, 2023 | 3:06 PM

డిసెంబర్ 3న బీఆర్ఎస్ కరెంట్ కట్ అవుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని ఆయన విమర్శించారు. కరీంనగర్‌ రోడ్‌షోలో పాల్గొన్న బండి సంజయ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తాను ఓటు రూ. 20 వేలు ఇస్తానని మంత్రి గంగుల కమలాకర్ దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తాను అక్రమాస్తులు సంపాదించానని మంత్రి గంగుల తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అక్రమాస్తులను నిరూపిస్తే ప్రజలకే ఇచ్చేస్తానన్నారు బండి సంజయ్.

భారీ వర్షాలతో కరీంనగర్ చుట్టుప్రక్కల గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు రూ. 10 వేలు ఇవ్వలేదు గానీ.. పంజాబ్ రాష్ట్రానికి పది లక్షల సాయం చేశారని బీఆర్ఎస్ సర్కార్‌పై బండి సంజయ్ ధ్వజమెత్తారు. ధాన్యం తరుగులో మంత్రి‌ గంగుల కమలాకర్ పాత్ర లేదని.. ఆయన దేవుడి‌ గుడిలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. పండించిన ప్రతి‌ ధాన్యం గింజను కేంద్ర ‌ప్రభుత్వమే కొంటుంది. పేపర్ లీకేజ్ వల్ల తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు. వారికి మద్దతుగా తాను ధర్నా చేస్తే.. మంత్రి గంగుల కమలాకర్, సీఎం కేసీఆర్ జైలుకు పంపారని బండి సంజయ్ తెలిపారు. తన మీద కక్ష్య కట్టి 74 కేసులు పెట్టారని ఎద్దేవా చేశారు. గంగుల కమలాకర్ డబ్బులను నమ్ముకుని‌ కరీంనగర్‌లో పోటి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కరీంనగర్ పార్లమెంట్‌ ‌పరిధిలో రూ. 7 వేల కోట్ల నిధులను అభివృద్ధి కోసం తీసుకొచ్చినట్టు ప్రజలకు గుర్తు చేశారు బండి సంజయ్.