Telangana: సామాన్యుడిగా వచ్చి సోషల్ మీడియాలో చక్రం తిప్పుతూ.. తెలంగాణ ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున ప్రచారం
ప్రదీప్ ఈశ్వర్ పేరు గుర్తుందా ? ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో "చిక్ బళ్ళాపూర్ " నియోజకవర్గం నుంచి అత్యంత బలవంతుడైన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిని ఓడించి, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇతని గెలుపు రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపోయేలా చేసింది. "మనల్ని ఎవడ్రా ఆపేది " అనే పవన్ కళ్యాణ్ డైలాగ్ తో తన ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చిక్కబళ్ళాపూర్ నియోజకవర్గంలో ఒక వూపు ఊపాడు.

ప్రదీప్ ఈశ్వర్ పేరు గుర్తుందా ? ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో “చిక్ బళ్ళాపూర్ ” నియోజకవర్గం నుంచి అత్యంత బలవంతుడైన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిని ఓడించి, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇతని గెలుపు రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపోయేలా చేసింది. “మనల్ని ఎవడ్రా ఆపేది ” అనే పవన్ కళ్యాణ్ డైలాగ్ తో తన ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చిక్కబళ్ళాపూర్ నియోజకవర్గంలో ఒక వూపు ఊపాడు. ఎన్నికలకు కేవలం నెలరోజుల ముందు టికెట్ సాధించి, ఎన్నికల ప్రచారంలో తన ఉపన్యాసాలతో కర్ణాటక యువతరాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఏ రాజకీయ కుటుంబ నేపధ్యం లేకుండా,ఎమ్మెల్యేగా గెలిచిన ఈ కుర్రాడు నేడు యువతరానికి రోల్ మాడల్‌గా నిలుస్తున్నారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రదీప్.. అనతికాలంలోనే కర్ణాటకలోని నీట్ (NEET) అకాడమీ కి అధినేతగా ఎదిగాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఇండిపెండెట్ అభ్యర్థికి మద్దతుగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ వ్యవహారాలు చూసుకున్నారు. తాడోపేడో తేల్చుకుందామని 2023 లో కర్ణాటక ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా చిక్కబళ్ళాపూర్ బరిలో దిగారు. కేవలం నెలరోజుల ముందు బరిలో దిగి తన పదునైన తెలుగు, కన్నడ ఉపన్యాసాలతో సదరు ఆరోగ్యమంత్రి సుధాకర్‌కు ముచ్చెమటలు పట్టించి మట్టికరిపించేశాడు. గెలిచిన వారంలోనే “నమస్తే చిక్కబళ్ళాపూర్ ” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రతిరోజూ ఉదయం రెండు గంటల పాటు నడుస్తూ, నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నాడు. ప్రజల సమస్యలని అక్కడికక్కడ పరిష్కరిస్తూ అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ రోజు కర్ణాటక సోషల్ మీడియాలో ప్రదీప్ ఈశ్వర్ అంటే ఒక సంచలనంగా మారారు. ఇందుకే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో “ప్రదీప్ ఈశ్వర్ ” ను రంగంలో దించింది. తన పదునైన మాటలతో ప్రచారం చేస్తూ అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..