Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తెలంగాణ ఎఎమ్మెల్యే, ఎంపీల తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు. వారానికి 2 బ్రేక్‌ దర్శనాలు.. మరో రెండు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమితించనున్నారు. ఈ మేరకు టీటీడీకి సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
Chandrababu, Revanth Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 31, 2024 | 8:35 AM

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గత కొంత కాలంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని.. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. వారానికి 4 లేఖలను అనుమతించాలని చెప్పినట్లు తెలిపారు. వారానికి 2 బ్రేక్‌ దర్శనాలు.. మరో రెండు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపై.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ఈ మేరకు పోస్టుతో పాటు వాళ్లిద్దరు పరస్పరం రాసుకున్న లేఖలను కూడా రేవంత్ రెడ్డి షేర్ చేశారు. ఈ పోస్టుతో పాటు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి రాసిన లేఖను.. దానికి స్పందిస్తూ చంద్రబాబు రాసిన లేఖను రేవంత్ రెడ్డి పంచుకున్నారు.

శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించినందుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కృషి చేశామని, ఇది ఫలించిందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రజాప్రతినిధుల సిఫార్సును అంగీకరించడం కొత్త సంవత్సర కానుకగా మంత్రి కొండా సురేఖ అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

మరోవైపు ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్వాగతించారు. ఏపీ ప్రజా ప్రతినిధులతో సమానంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు అనుమతించాలని కోరారు. తిరుమలలో తానేం తప్పుగా మాట్లాడలేదన్నారు మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భక్తుల మనోభావాలను మాత్రమే వ్యక్త పరిచానని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రాణాంతక వ్యాధిపై ప్రధాని యుద్ధం.. అవే కారణమంటూ కామెంట్స్
ప్రాణాంతక వ్యాధిపై ప్రధాని యుద్ధం.. అవే కారణమంటూ కామెంట్స్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రామ్ చరణ్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రామ్ చరణ్
1 నెలలో రికార్డు సృష్టించిన దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు!
1 నెలలో రికార్డు సృష్టించిన దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు!
థగ్ లైఫ్ లేటెస్ట్ అప్డేట్.. అన్ని డౌట్స్‌కు ఫుల్ స్టాప్‌..
థగ్ లైఫ్ లేటెస్ట్ అప్డేట్.. అన్ని డౌట్స్‌కు ఫుల్ స్టాప్‌..
సూపర్‌ క్యాచ్‌ పట్టిన ఈ క్రికెటర్‌ ఎవరో గుర్తు పట్టారా?
సూపర్‌ క్యాచ్‌ పట్టిన ఈ క్రికెటర్‌ ఎవరో గుర్తు పట్టారా?
పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!
పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!
ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే ఫ్యూజులవుట్..
ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే ఫ్యూజులవుట్..
అగ్ని ప్రమాదాలు నివారణకు సరికొత్త టెక్నాలజీ.. ఇక క్షణాల్లో..
అగ్ని ప్రమాదాలు నివారణకు సరికొత్త టెక్నాలజీ.. ఇక క్షణాల్లో..
ఎలాన్ మస్క్ ఆ రహస్యం ఖరీదు రూ. లక్ష కోట్లు..!
ఎలాన్ మస్క్ ఆ రహస్యం ఖరీదు రూ. లక్ష కోట్లు..!
మక్కల్ సెల్వన్ రూట్‎లోనే సూర్య.. బిగ్ డెసిషన్ తీసుకున్న నటుడు..
మక్కల్ సెల్వన్ రూట్‎లోనే సూర్య.. బిగ్ డెసిషన్ తీసుకున్న నటుడు..