JOST for Inter Admissions: ఇక దోస్త్‌ తరహాలో జోస్త్‌.. డిగ్రీ మాదిరి ఇంటర్‌ అడ్మిషన్లూ ఆన్‌లైన్‌లోనే!

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రవేశాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా సర్కార్ పరిధిలోనే జరగనున్నాయి. ఇప్పటికే డిగ్రీ ప్రవేశాలు ఆన్ లైన్ ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ప్రవేశాలు కూడా ఆన్ లైన్ లోనే చేపట్టాలని ఇంటర్ బోర్డు రంగం సిద్ధం చేస్తుంది. తద్వారా ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డుకట్టపడే ఛాన్స్ ఉంది..

JOST for Inter Admissions: ఇక దోస్త్‌ తరహాలో జోస్త్‌.. డిగ్రీ మాదిరి ఇంటర్‌ అడ్మిషన్లూ ఆన్‌లైన్‌లోనే!
JOST for Inter Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 31, 2024 | 8:40 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల విధానం 2025-26 విద్యా సంవత్సరం నుంచి మారనుంది. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల మాదిరి ఇంటర్‌ ప్రవేశాలకు కూడా ఆన్‌లైన్‌ అడ్మిషన్లు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న ‘దోస్త్‌’ తరహాలోనే ఇంటర్‌లో జూనియర్‌ కాలేజీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (జోస్త్‌) విధానాన్ని సర్కార్‌ తీసుకురానుంది. వచ్చే విద్యాసంవత్సరం జూన్‌ నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్‌ను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఆన్‌లైన్‌లో విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని కాలేజీల్లో డిగ్రీ సీట్లను ‘దోస్త్‌’ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ విధానంతో ప్రైవేట్‌ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్టపడినట్లైంది. ఇదే తరహాలో ఇంటర్‌లోనూ ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నారు. గతంలో పదో తరగతిలో గ్రేడింగ్‌ విధానం ఉండేది. దీంతో మెరిట్‌ ఆధారంగా సీట్లను కేటాయించలేని పరిస్థితి ఉండేది. కానీ ఈ ఏడాది నుంచి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు రేవంత్‌ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులకు గ్రేడ్ల స్థానంలో మార్కులను జారీ చేస్తారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1200 పైచిలుకు ప్రైవేట్‌ కాలేజీన్నాయి. అయితే కొన్ని కార్పొరేట్‌ కాలేజీల్లో అడ్మిషన్ల పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. పైగా పదో తరగతి పరీక్షలకు ముందే అడ్మిషన్లు చేపడుతున్నాయి. పైగా ఇంటర్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ రాకముందే డిసెంబర్‌లోనే ముందస్తుగా ఈ ప్రక్రియను చేపడుతున్నాయి. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల చేరికలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. కొత్త విధానంతో ఆన్‌లైన్‌లో గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను అందుబాటులోకి తెస్తారు. విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు ఎంచుకోవాలి. ఆప్షన్లు, మెరిట్‌ను అనుసరించి సీట్లు కేటాయింపు ఉంటుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలన్న తేడాల్లేకుండా ఒకేసారి అడ్మిషన్లు సకాలంలో పూర్తవుతాయి. ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో విద్యార్థి తనకు నచ్చిన కాలేజీలో చేరే అవకాశం ఉంటుంది.

అయితే ఆన్‌లైన్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు సంబంధించి ఫీజులను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. సర్కారు కాలేజీల్లో ఉచిత విద్యనందిస్తున్నా.. ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశాల ఫీజులు ఎలాగన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల్లో కొత్తగా అడ్మిషన్లు కల్పించకుండా ఉన్న విద్యార్థులనే అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫీజుల ఖరారు చేయకపోవడంతో ఆన్‌లైన్ ప్రవేశాలు సాధ్యమయ్యేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నాడు హీరోగా.. నేడు విలన్‌గా.. 188 రోజుల్లోనే రోహిత్ కెరీర్ క్లోజ్
నాడు హీరోగా.. నేడు విలన్‌గా.. 188 రోజుల్లోనే రోహిత్ కెరీర్ క్లోజ్
గేట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
గేట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
శుక్రవారంఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజించండి డబ్బుకు కొరత ఉండదు
శుక్రవారంఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజించండి డబ్బుకు కొరత ఉండదు
బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! వేగంగా వ్యాప్తి
బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! వేగంగా వ్యాప్తి
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా
సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా
కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి..
Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి..
సిడ్నీ టెస్ట్‌కు వర్షం ముప్పుందా? ఐదు రోజుల వాతావరణ నివేదిక ఇదిగో
సిడ్నీ టెస్ట్‌కు వర్షం ముప్పుందా? ఐదు రోజుల వాతావరణ నివేదిక ఇదిగో
అఫీషియల్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్
అఫీషియల్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!