AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana VLO Posts: గ్రామ రెవెన్యూ అధికారి పోస్టులకు పోటెత్తిన దరఖాస్తులు.. త్వరలోనే తుది జాబితా వెల్లడి

తెలంగాణలో గత ప్రభుత్వం రద్దు చేసిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను రేవంత్ సర్కార్ పునరుద్దరించేందుకు కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఇప్పటికే గ్రామస్థాయి అధికారుల (వీఎల్‌వో) పోస్టులకు ప్రకటన జారీ చేసింది. అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. త్వరలోనే తుది జాబితాను వెల్లడి కానుంది..

Telangana VLO Posts: గ్రామ రెవెన్యూ అధికారి పోస్టులకు పోటెత్తిన దరఖాస్తులు.. త్వరలోనే తుది జాబితా వెల్లడి
Telangana VLO Posts
Srilakshmi C
|

Updated on: Dec 31, 2024 | 9:15 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియామించేందుకు రేవంత్‌ సర్కార్ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గ్రామస్థాయి అధికారుల (వీఎల్‌వో) పోస్టులకు ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అయితే ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటితోపాటు సర్వేయర్ల పోస్టులకు 2,625 దరఖాస్తులు దాఖలైనట్లు తెలుస్తుంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కార్యచరణ రూపొందించింది.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వాటిల్లో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఎల్‌వోను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటి భర్తీలో భాగంగా గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారి నుంచి ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించారు. గత శనివారంతో గడువు ముగిసింది. మరోవైపు 1000 మంది సర్వేయర్ల నియామకానికీ అర్హుల నుంచి దరఖాస్తులు కోరగా… ఈ పోస్టులకు కూడా భారీగానే దరఖాస్తు అందాయి. ఈ రెండు పోస్టులకు డిగ్రీ, ఇంటర్‌తోపాటు ఇతర విద్యార్హతలు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో వీఎల్‌వో, సర్వేయర్‌ పోస్టులకు అర్హులను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను పంపాలని రెవెన్యూ శాఖ నిర్ణయించినట్లు సమాచారం.

కాగా బీఆర్‌ఎస్‌ పాలనలో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీఆర్వోలను జూనియర్‌ అసిస్టెంట్లుగా, వీఆర్‌ఏలను జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి అటెండర్‌ వరకు వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. అయితే ఈ ప్రక్రియలో తమ సీనియారిటీని పట్టించుకోలేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా నియమించనున్న వీఎల్‌వో పోస్టులకు.. అందిన దరఖాస్తుల్లో సుదీర్ఘ అనుభవమున్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చి వీఎల్‌వోలుగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!