CM Revanth Reddy-Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌.. ఆ విషయంపై కీలక చర్చలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండింగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసేలా చొరవ చూపాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ, సహకారాలందించాలని కిషన్ రెడ్డిని కోరారు.

CM Revanth Reddy-Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌.. ఆ విషయంపై కీలక చర్చలు
Revanth Reddy, Kishan Reddy
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2023 | 9:27 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (డిసెంబర్‌ 12) కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. తెలంగాణకు సంబంధించిన రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం రేవంత్ కిషన్‌ రెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండింగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసేలా చొరవ చూపాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ, సహకారాలందించాలని కిషన్ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్రం వైపు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా సహకారం ఉంటుందని కిషన్ రెడ్డి సీఎం రేవంత్‌కు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కార్‌.. పని మొదలెట్టేసింది. ఇందులో భాగంగా వరుస రివ్యూలతో దూసుకెళ్తున్నారు నయా సీఎం రేవంత్‌ రెడ్డి. కీలకమైన ధరణి ఇష్యూపైనా, మెట్రో విస్తరణపైనా సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ ధరణి పోర్టల్‌పై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ… అధికారం చేపట్టగానే కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ధరణిపై మంత్రి పొంగులేటి సహా ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి… వెబ్‌సైట్‌పై ఆరా తీశారు. ధరణి లోటుపాట్లపై 10రోజుల్లో నివేదిక ఇవ్వాలని… వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను నివేదికలో పొందుపరచాలనీ అధికారులను ఆదేశించారు. ధరణి యాప్‌ భద్రతవివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. అందులో లావాదేవీలపై వస్తున్న విమర్శలకు.. డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.

ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయని గుర్తించామన్న సీఎం.. మండలస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోసారి ధరణిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌పైనా సీఎం రేవంత్‌ రెడ్డి రివ్యూ చేశారు. మెట్రో ఎండీ సహా ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. మెట్రో విస్తరణ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు విస్తరణ వ్యయం, పనుల పురోగతిపై ఆరా తీశారు.

ఇవి కూడా చదవండి

సహకారం అందించండి: సీఎం రేవంత్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..