AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy-PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపైనే కీలక చర్చ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన రేవంత్ రెడ్డి పలు విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా SLBC టన్నెల్‌ సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి సీఎం వివరించారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల జాబితాను ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి అందజేశారు..

CM Revanth Reddy-PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపైనే కీలక చర్చ..
Cm Revanth Reddy Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Feb 26, 2025 | 4:31 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన రేవంత్ రెడ్డి పలు విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా SLBC టన్నెల్‌ సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి సీఎం వివరించారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల జాబితాను ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి అందజేశారు.. ప్రధానంగా 5 అంశాలపై వినతులు సమర్పించారు సీఎం రేవంత్… మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ట్రిపుల్‌ ఆర్‌తో పాటు ప్యూచర్‌ సిటీకి సాయం చేయాలని కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేస్ – 2 కోసం రూ. 22 వేల కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.. రీజనల్ రింగ్ రోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా మంజూరు చేయాలని కోరారు.. డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే తో పాటు సమాంతరంగా గ్రీన్ఫీల్డ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. మూసీ పునరజ్జీవన ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వాలన్నారు. గుజరాత్ సబర్మతి ప్రాజెక్టు మాదిరిగా మూసి ప్రాజెక్టు ఉంటుందని.. గోదావరి నదిని మూసితో అనుసంధానించి స్వచ్ఛమైన జలాలను అందించాలని కోరారు. 27 కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాలు మంజూరు చేయాలన్నారు. వరద నివారణకు రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, కరకట్టల బలోపేతం చేయాలని.. దీనికోసం నిధులు కేటాయించాలని కోరారు.

సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ సూచనలు..

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ సూచనలు చేశారు. 2017 నుంచి 2022 వరకు పెండింగ్‌ అంశాలపై.. దృష్టిపెట్టాలని సీఎం రేవంత్‌కి ప్రధాని మోదీ సూచించారు. ప్రధాని ఆవాస్‌ యోజన గ్రామీణపథకం.. తెలంగాణలో అమలు కావడం లేదని.. 2025 మార్చి 31 నాటికి సర్వే పూర్తి చేసి.. అర్హులను గుర్తించాలని సీఎం రేవంత్‌కి సూచించారు. శంషాబాద్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి రూ.150 కోట్లు చెల్లించాలన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో.. 3మొబైల్ కనెక్టివిటీప్రాజెక్టులు పెండింగ్‌లోఉన్నాయని తెలిపారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌కి విద్యుత్‌, వాటర్ సప్లై కోసం.. రూ.1365.95 కోట్లు చెల్లించాలని సూచించారు. తెలంగాణలో రెండు రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం.. అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మూడు నీటి పారుదల ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించి పంపాలని మోదీ సూచించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..