AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అనూష.. ఉరికి వేలాడుతూ…

పది రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వర్గల్‌ గ్రామానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ మామిడి అనూష(30) భువనగిరిలోని జిల్లా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆమెకు పెళ్లి కుదిర్చారు పెద్దలు. కుటుంబసభ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Telangana: కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అనూష.. ఉరికి వేలాడుతూ...
Anusha
Ram Naramaneni
|

Updated on: Feb 26, 2025 | 3:12 PM

Share

పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట.. చావు మేళం మోగింది. బిడ్డ పెళ్లిని.. వైభవంగా చేసి.. ఆనందంగా ఆమెను అత్తారింటి పంపాలని కలలు గన్న తల్లిండ్రులు… ఇప్పుడు కన్నీళ్లలో స్మశానానికి సాగనంపాల్సి వచ్చింది. 10 రోజుల్లో మ్యారేజ్ ఉందనగా.. లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరిలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాకు చెందిన అనూష యాదాద్రి భువనగిరి పోలీస్​ హెడ్​ క్వార్టర్స్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తోంది.

ఇటీవలే అనూషకు మ్యారేజ్ కుదిరింది. మార్చి 6న పెళ్లి నిశ్చయించారు పెద్దలు. వివాహం అంగరంగవైభవంగా చేసేందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. కానీ ఏమైందో ఏమో.. అనూహ్య ఫిబ్రవరి 25న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కుతుంది అనుకున్న కూతురు ఉరి తాడుకు వేలాడటం చూసి తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు.  గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఇంటికి చేరుకుని డెడ్‌బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తలరించారు. కేసు నమోదు చేసి.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి