CM Revanth Reddy: అనుచరుడి కోసం మెట్టు దిగారా..? కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ కొత్త స్ట్రాటజీ..!

కాంగ్రెస్ కంచుకోట ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ పెట్టారా..? ఉమ్మడి జిల్లాలోని రెండు సిట్టింగ్ పార్లమెంటు స్థానాలపై రేవంత్ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నారా..? నల్గొండ జిల్లా కాంగ్రెస్ పై పట్టు కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారా..? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తోంది.

CM Revanth Reddy: అనుచరుడి కోసం మెట్టు దిగారా..? కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ కొత్త స్ట్రాటజీ..!
Revanreddy Rajagopal Reddy Chamala Kiran Reddy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 13, 2024 | 4:01 PM

కాంగ్రెస్ కంచుకోట ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ పెట్టారా..? ఉమ్మడి జిల్లాలోని రెండు సిట్టింగ్ పార్లమెంటు స్థానాలపై రేవంత్ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నారా..? నల్గొండ జిల్లా కాంగ్రెస్ పై పట్టు కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారా..? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. అనుచరుడు చామల కిరణ్ కోసం రేవంత్ ఓ మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సీఎం రేవంత్ కు సఖ్యత కుదిరిందట. జిల్లాలో తన టీమ్ ఏర్పాటు కోసమే దిగ్గజనేతల మధ్య సమన్వయం కోసం స్వయంగా సీఎం రేవంత్ రంగంలోకి దిగారు. ఇంతకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పట్టు సాధిస్తారా.. అనే చర్చనీయాంశంగా మారింది.

కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. జిల్లాలో12 స్థానాలకు గాను 11 స్థానాలను కైవసం చేసుకొని పూర్వ వైభోవాన్ని చాటుకుంది. ఉమ్మడి జిల్లా నుంచి రాజకీయ ఉద్దండులు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిలు రాష్ట్ర కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ లో వీరంతా ఎవరికి వారే వర్గాలుగా విడిపోయి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లా రాజకీయాల్లో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి జోక్యాన్ని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో రేవంత్.. కోమటిరెడ్డి మధ్య సఖ్యత ఏర్పడింది. జిల్లా నేతలు కలిసికట్టుగా పనిచేసే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి రేవంత్ మంత్రి వర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. జిల్లాలోని రెండు ఎంపీ సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ దూకుడు పెంచింది.

అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న రేవంత్..

నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల టికెట్ల విషయంలోనూ రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకున్నారు. సీనియర్ నేత జానారెడ్డి తనయుడు, తన సన్నిహితుడు రఘువీర్ రెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ వచ్చింది. భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద కసరత్తే చేసింది. తమకు గట్టిపట్టు ఉన్న భువనగిరి పార్లమెంటు టికెట్‌పై కోమటిరెడ్డి కుటుంబం గురి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ రెడ్డి భువనగిరికి టికెట్ ను ఆశించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తనయుడు సూర్య పవన్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి కూడా భువనగిరి టికెట్ ను ఆశించారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక ఢిల్లీ వేదికగా తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య జరిగింది. చివరికి తన అనుచరుడు చామల కిరణ్ రెడ్డికి టికెట్ ఇప్పించుకుని రేవంత్ రెడ్డి తన మాటను నెగ్గించుకున్నారు.

అనుచరుడి కోసం ఓ మెట్టు దిగిన రేవంత్..

భువనగిరి నుంచి పోటీ చేస్తున్న అనుచరుడు చామల కిరణ్ రెడ్డి గెలుపు కోసం సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. గతంలో భువనగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. ఈ సీటు తన అనుచరుడు చామల కిరణ్ కు దక్కడంపై కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తిగా ఉన్నారని, జిల్లాలో క్యాడర్ అయోమయంలో పడిపోయిందని ప్రచారం సాగింది. దీంతో రంగంలోకి దిగిన రేవంత్.. కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తికి చెక్ పెట్టారు.

జిల్లాలో తన టీం ను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగానే భువనగిరి నుంచి చామల కిరణ్ గెలుపు కోసం కొత్త స్ట్రాటజీతో రేవంత్ ముందుకు సాగుతున్నారట. అనుచరుల గెలుపు కోసం సీఎం రేవంత్.. భేషజాలను పక్కనపెట్టి, ముందుకు వెళ్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతున్నది. ఇందులో భాగంగానే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి రేవంత్ ఓ మెట్టు దిగారు. భువనగిరిలో గెలుపుపై కీలక అంశాలపై ఇద్దరూ చర్చించారట. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వ్యూహ, ప్రతి వ్యూహాలను చర్చించారట.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో రేవంత్ సఖ్యత కుదిరిందా..?

గతంలో పిసిసి అధ్యక్ష పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నించిన కోమటిరెడ్డి బ్రదర్స్.. రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి రేవంత్‌పై ఘాటైన విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రేవంత్ రెడ్డికి సఖ్యత ఏర్పడింది. రాష్ట్ర కేబినెట్ లో బెర్త్ ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భువనగిరి పార్లమెంటు ఎన్నికలతో రేవంత్ కు మధ్య సఖ్యత ఏర్పడిందట. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే కేబినెట్ విస్తరణలో బెర్త్ కల్పించే అంశంలో తన మద్దతు ఉంటుందని రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ భరోసా ఇచ్చారట. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో సీఎం రేవంత్ రెడ్డికి సయోధ్య కుదిరిందట.

కిరణ్ రెడ్డి గెలుపు బాధ్యత రాజగోపాల్ రెడ్డికి అప్పగింత..

భువనగిరిలో చామల కిరణ్ ఖచ్చితంగా గెలిచి తీరాలన్నది రేవంత్ లక్ష్యం కాగా, చామల గెలవాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంచార్జిగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సికింద్రాబాద్ కు మార్చి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భువనగిరి పార్లమెంటు నియోజక వర్గం ఇంచార్జిగా హైకమాండ్ ప్రకటించింది. చామల కిరణ్ ని గెలిపించే బాధ్యత పూర్తి స్థాయిలో రాజగోపాల్ రెడ్డిపై పెట్టారు. దీంతో భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో వరుసగా సన్నాహక సమావేశాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నెల 21న అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించారట. అదే రోజు భువనగిరిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారట.

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు.. ఇటు రేవంత్ రెడ్డికి, అటు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చాలెంజ్‌గా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!