CM Revanth: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఫైనల్ జాబితాపై అధిష్టానంతో మంతనాలు
కాంగ్రెస్ హైకమాండ్ సమావేశంలో పాల్గొని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరో ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఉన్నారు.

కాంగ్రెస్ హైకమాండ్ సమావేశంలో పాల్గొని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరో ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఉన్నారు. లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే పార్టీ నేతలు, క్యాడర్ తో సంప్రదింపులు పూర్తి చేసింది.
అందుకు అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల జాబితాను రూపొందించారు. పార్టీ అధిష్టానాన్ని సంప్రదించిన తర్వాత భువనగిరి, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాలకు ఎనిమిది మంది అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు.
అయితే ఖమ్మం, భువనగిరి లోక్ సభ స్థానాలపై అటు పార్టీ నాయకుల్లో, ఇటు జనాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం టికెట్ ను తన సతీమణి నందినికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్దతుతో తన సతీమణి లక్ష్మికి భువనగిరి టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ స్థానాలకు కూడా పలువురు ఆశావహులు ఉండటంతో అభ్యర్థుల ఎంపికను ఆసక్తిగా మారింది.