Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌కు రేవంత్ కేబినెట్ ఆమోదం.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి
తెలంగాణ బడ్జెట్‌కు రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024- 25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.

తెలంగాణ బడ్జెట్‌కు రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024- 25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి 2024-25 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.2.97 లక్షల కోట్లతో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. అలాగే 6 గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. జూలై 26న అసెంబ్లీకి సెలవు, 27న బడ్జెట్ పద్దుపై చర్చ జరగనుంది. 28న ఆదివారం సెలవు ఉంటుంది. ఇక తిరిగి జూలై 29, 30 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. జూలై 31న ద్రవ్య వినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.