Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు.. మన తెలంగాణ పైసలు లేవా?.. జడ్చర్ల సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణను ఉత్తిగా ఇవ్వలేదు, విద్యార్థులను బలి తీసుకొని ఇచ్చారు.. శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు..? శ్రీశైలంలో మన తెలంగాణ పైసలు లేవా?.. పాలమూరు-ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు మార్చాం. టన్నెల్స్‌ పుర్తయ్యాయి, మోటార్లు బిగిస్తున్నారు. ఇప్పుడు కూడా కొందరు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో లక్షా 50 ఎకరాలకు సాగునీరు అందిస్తాం.. కరువు మనవైపు కన్నెత్తి కూడా చూడదు.. అంటూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

CM KCR: శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు.. మన తెలంగాణ పైసలు లేవా?.. జడ్చర్ల సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 18, 2023 | 5:40 PM

తెలంగాణను ఉత్తిగా ఇవ్వలేదు, విద్యార్థులను బలి తీసుకొని ఇచ్చారు.. శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు..? శ్రీశైలంలో మన తెలంగాణ పైసలు లేవా?.. పాలమూరు-ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు మార్చాం. టన్నెల్స్‌ పుర్తయ్యాయి, మోటార్లు బిగిస్తున్నారు. ఇప్పుడు కూడా కొందరు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో లక్షా 50 ఎకరాలకు సాగునీరు అందిస్తాం.. కరువు మనవైపు కన్నెత్తి కూడా చూడదు.. అంటూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి, తదితర అంశాలపై ప్రసంగించారు. జడ్చర్లను అద్భుతంగా తీర్చి దిద్దుకున్నాం.. మహబూబ్‌నగర్‌ నా గుండెల్లో ఉంటుందంటూ కేసీఆర్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ చరిత్రలో నిల్చిపోతుందని వివరించారు.

మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే ఎంపీగా పోటీచేయాలని జయశంకర్ సార్ చెప్పారని.. మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ సాధించాననే కీర్తి చిరకాలం ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. నడిగడ్డలో ఒక ఊర్లో ఏడ్చానని.. కృష్ణ నది పక్కనే పారుతున్నా.. గుక్కెడు నీళ్ళు లేవు.. ముఖ్యమంత్రుల పర్యటనలు, నాటకాలు చూశామని.. మహబూబ్ నగర్ ఎప్పటికీ తన గుండెల్లో ఉంటుందంటూ పేర్కొ్న్నారు. జూరాల బెత్తెడు ప్రాజెక్ట్.. అందులో ఉండేది 9 టీఎంసీలు.. రోజుకు 2 టీఎంసీలు తీసుకుంటే మూడు రోజుల్లో ఖాళీ అవుతుంది. శ్రీశైలం వాళ్ల జాగీరా..? అందుకే అక్కడి నుంచి తీసుకుందామని చెప్పామన్నారు. అప్పటి సన్నాసులు, దద్దమ్మలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు.. వాళ్ళు ఈ జిల్లాలో ఎలా పుట్టారో తెలవడంలేదంటూ మండిపడ్డారు. నాడు, నేడు వాళ్ళది భావ దారిద్ర్యమే.. తెలంగాణ ఎవ్వడో ఊరికే వచ్చి ఇచ్చిపోలేదన్నారు. పిడికిలి ఎత్తి పోరాటం చేస్తే, అనేక మందిని బలితీసుకుని.. బాధలు పెట్టారని.. తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడితే తెలంగాణ వచ్చిందంటూ కేసీఆర్ పేర్కొన్నారు.

ఇదే జిల్లాలో పుట్టిన కాంగ్రెస్ నేతలు కేసులు వేసి అడ్డం పడ్డారని.. రాబోయే మూడు, నాలుగు నెలల్లో అన్ని రిజర్వాయర్లలో నీళ్ళు చూస్తారంటూ కేసీఆర్ హామీనిచ్చారు. లక్షా 50వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి.. అదే జరిగితే కరువు కన్నెత్తి కూడా చూడదంటూ పేర్కొన్నారు. పరిశ్రమల కేంద్రంగా జడ్చర్లను తీర్చిదిద్దే బాధ్యత తనదని.. పాలమూరు జిల్లా పాలుగారే జిల్లాగా, బంగారు తునకగా మారుతుందంటూ పేర్కొన్నారు. అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని.. గణపతి నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగ ఒకేసారి వస్తే ముస్లిం సోదరులు వాయిదా వేసుకున్నారంటూ గుర్తుచేశారు. ఇది అసలైన గంగా జమునా తహజిబ్ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తాను పుట్టించిందే రైతు బంధు పథకమని.. ప్రపంచంలో ఎక్కడా లేదని కేసీఆర్ పేర్కొన్నారు. రూ.37వేల కోట్ల రైతురుణాల మాఫీ చేశామని.. 10 ఏళ్లలో తెలంగాణ రైతు దేశంలోనే గొప్ప రైతుగా మారుతాడన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రైతులకు 3గంటల కరెంటు సరిపోతుందని తన కడుపులోని మాట బయట పెట్టారని.. వాళ్ళు వస్తే కరెంటు కట్ అవుతుందన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలో 24గంటల కరెంట్ లేదని.. కాంగ్రెస్ వస్తే రైతుబంధును ఆపేస్తారంటూ పేర్కొన్నారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఉద్దండపుర్ బాధితులకు నష్ట పరిహారం వెంటనే అందిస్తామని.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కేసీఆర్ కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..