Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రివ్యూలు రాస్తే చేతినిండా డబ్బు పక్కా అన్నారు.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు..!

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది.. సైబర్ నేరగాళ్లు కూడా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. టార్గెట్ చేసి అమాయకుల జేబులకు చిల్లు వేస్తూ దండుకుంటున్నారు.. రకరకాల వాట్సప్ లింకులతో మెసేజ్లు పంపిస్తూ అమాయకులకు అత్యాశ చూపించి డబ్బు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా సైబర్ ఉచ్చులో ఇరుకున్న హైదరాబాద్ వాసి గణేష్ బాబు.. అక్షరాల 78 లక్షలు రూపాయలు పోగొట్టుకున్నాడు.

Hyderabad: రివ్యూలు రాస్తే చేతినిండా డబ్బు పక్కా అన్నారు.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు..!
Crime News
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 18, 2023 | 6:23 PM

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది.. సైబర్ నేరగాళ్లు కూడా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. టార్గెట్ చేసి అమాయకుల జేబులకు చిల్లు వేస్తూ దండుకుంటున్నారు.. రకరకాల వాట్సప్ లింకులతో మెసేజ్లు పంపిస్తూ అమాయకులకు అత్యాశ చూపించి డబ్బు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా సైబర్ ఉచ్చులో ఇరుకున్న హైదరాబాద్ వాసి గణేష్ బాబు.. అక్షరాల 78 లక్షలు రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇక చేసేది లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి.. తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రాకు చెందిన గణేష్ బాబు వాట్సాప్‌లో వచ్చిన ఒక లింక్ వచ్చింది. పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో తన మొబైల్ కు లింక్ రావడంతో.. ఉపాధి దొరుకుందంటూ హ్యాపీగా ఫీలయ్యాడు. అప్పుడే ఎంటరైన సైబర్‌ క్రిమినల్స్‌.. గూగుల్ మ్యాప్స్ లో చూపించే లొకేషన్స్ రివ్యూ వస్తే చాలు పైసలు మీ అకౌంట్ కి వస్తాయంటూ నమ్మించారు. దీనికి అదనంగా ఒక టెలిగ్రామ్ గ్రూప్‌ను ఫాలో కావాల్సిందిగా చెప్పారు.. @jayaram888, @Nisha1153, @Jason748 ఛానల్స్‌లో కమ్యూనికేట్ అవ్వాలని చెప్పారు. ఒక్కో రివ్యూకు 450 రూపాయలు చెల్లించారు. మొదట్లో ఒక్కో రివ్యూకు 450 రూపాయలు ఆదాయం చొప్పున చెల్లించారు. ఆ తరువాత క్రిప్టో ట్రేడింగ్ కు గణేష్‌ను అలవాటు చేశారు.

ఇందులో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపారు. మొదట 2 వేలు పెడితే.. 2 వేల 800 రూపాయలు చెల్లించారు. అలా ఎక్కువ చెల్లించాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. చివరికి 77 లక్షల 88 వేల రూపాయలు చెల్లించాలంటూ సూచించారు. ఇలా 35 లావాదేవీల్లో ఈ డబ్బు మొత్తాన్ని చెల్లించాడు. ఇంత కంటే ఎక్కువ డబ్బు పెడితే మొత్తం ఒకేసారి ఎక్కువగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని నమ్మించడంతో గణేష్‌ అన్నింట్లో డబ్బులు పెట్టుబడి పెట్టాడు..

ఇలా ఎన్నిసార్లు డిపాజిట్ చేసినా విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన గణేష్.. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేస్ నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద జాబ్ ఆఫర్ల లింకులను, పెట్టుబడి పేరుతో అధిక సంపాదన అంటూ వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. పిన్‌ నెంబర్లను కూడా ఎవరితోనూ పంచుకోవద్దంటూ సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..