Telangana Elections: బీజేపీ – జనసేన పొత్తు పొడుస్తుందా..? పవన్ కల్యాణ్‌తో కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ భేటీ..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు.. తెలంగాణ సమరంలో పోటీచేసేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా సిద్ధమవుతోంది. 32 స్థానాల్లో పోటీచేయనున్నట్లు తెలంగాణ జనసేన నేతలు ప్రకటించారు.

Telangana Elections: బీజేపీ - జనసేన పొత్తు పొడుస్తుందా..? పవన్ కల్యాణ్‌తో కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ భేటీ..
Pawan Kalyan, Kishan Reddy, Laxman
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 18, 2023 | 3:20 PM

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు.. తెలంగాణ సమరంలో పోటీచేసేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా సిద్ధమవుతోంది. 32 స్థానాల్లో పోటీచేయనున్నట్లు తెలంగాణ జనసేన నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీజేపీ.. ఏపీలోని మిత్ర పార్టీ జనసేనను కలుపుకుని.. ఎన్నికల సంగ్రామంలో తలపడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందు తెలంగాణలో జనసేనతో ఉమ్మడి పోటీ గురించి బీజేపీ నేతలు బుధవారం ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఇప్పటికే జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై ప్రధానంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని, బీజేపీ అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకుని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని వివరించారు.

Pawan Kalyan, Kishan Reddy,

Pawan Kalyan, Kishan Reddy

ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కు పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తెలియచేశారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కలిసి పోటీచేస్తే.. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేస్తారు..? జనసేనకు బీజేపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుంది..? పొత్తుపై జనసేన అధినేత నిర్ణయం ఎలా ఉండనుంది…? అనే విషయాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..