AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ఆయనొచ్చే వరకు అవెప్పుడూ పెండింగ్ లోనే ఉండేవి.. సీజేఐ అయ్యాకే ఆ సమస్యకు పరిష్కారం దొరికిందన్న సీఎం కేసీఆర్..

CM KCR on CJI NV Ramana: రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని.. న్యాయరంగంలోనూ పురోగమించేలా కృషిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును..

CM KCR: ఆయనొచ్చే వరకు అవెప్పుడూ పెండింగ్ లోనే ఉండేవి.. సీజేఐ అయ్యాకే ఆ సమస్యకు పరిష్కారం దొరికిందన్న సీఎం కేసీఆర్..
Cm Kcr On Cji Nv Ramana
Sanjay Kasula
|

Updated on: Apr 15, 2022 | 1:09 PM

Share

రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని.. న్యాయరంగంలోనూ పురోగమించేలా కృషిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును(Telangana Judicial Officers).. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ(CJI NV Ramana), హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైకోర్టు విడిపోయాక బెంచీలు, జడ్జిల సంఖ్య పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీకి తాను లేఖలు రాశానని.. కానీ, అవెప్పుడూ పెండింగ్ లోనే ఉండేవని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే, జస్టిస్ రమణ సీజేఐ అయ్యాకే ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని వెల్లడించారు. హైదరాబాద్ పై ఆయనకున్న అమితమైన ప్రేమతో ప్రధాని, కేంద్రంతో మాట్లాడి హైకోర్టు జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారని చెప్పారు.

దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఉండడం గర్వకారణమన్నారు. జడ్జిల సంఖ్య పెరగడంతో 885 అదనపు పోస్టులను హైకోర్టుకు మంజూరు చేశామని తెలిపారు. జిల్లా, సివిల్ కోర్టుల్లో పనిభారం ఎక్కువగా ఉందని, ఆ సమస్య పరిష్కారానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ చొరవ తీసుకోవాలని కోరారు. కాగా, న్యాయమూర్తుల హోదాకు తగినట్టు 42 మంది జడ్జిలకు 30 ఎకరాల్లో క్వార్టర్స్ నిర్మించి ఇస్తామని, సీజేఐ రమణతోనే శంకుస్థాపన చేయిస్తామని కేసీఆర్ చెప్పారు.

మరోవైపు తెలంగాణ ఏర్పడ్డాక అందరి సహాయ సహకారాలతో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని కేసీఆర్ అన్నారు. ఆర్థిక పురోగతి బాగుందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ముందుకెళ్తున్నామని చెప్పారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, అన్ని జిల్లాల్లోనూ సమీకృత కలెక్టరేట్లను నిర్మించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..

JAIHO BHARATH: జై హో భారత్.. తటస్థ విధానంతోనే పలు దేశాలను దారిలోకి తెచ్చిన దౌత్య విధానం.. అమెరికాలో మార్పుకు అదే కారణం!