Biryani: బిర్యానీ లేదన్నందుకు యువకుల వీరంగం.. హోటల్ యజమానిపై దాడి, అద్దాలు ధ్వంసం

Biryani: బిర్యానీ కోసం కొందరు యువకులు దారుణాలకు పాల్పడుతున్నారు. సమయం కానీ సమయంలో వచ్చి బిర్యానీ కావాలంటే రచ్చ చేస్తున్నారు...

Biryani: బిర్యానీ లేదన్నందుకు యువకుల వీరంగం.. హోటల్ యజమానిపై దాడి, అద్దాలు ధ్వంసం
Follow us
Subhash Goud

|

Updated on: Apr 15, 2022 | 1:43 PM

Biryani: బిర్యానీ కోసం కొందరు యువకులు దారుణాలకు పాల్పడుతున్నారు. సమయం కానీ సమయంలో వచ్చి బిర్యానీ కావాలంటే రచ్చ చేస్తున్నారు. మద్యం మత్తులో ఎలాంటి పనులు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఆస్తుల విషయాలలో, ఇతర పగప్రతీకారాలతో గొడవ పడుతుంటారు. కానీ కొందరు యువకులు బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ యజమానిపైనే దాడికి దిగడం సంచలనం మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లాలో కొందరు యువకులు మద్యం మత్తులు అర్ధరాత్రి సమయంలో బిర్యానీ కోసం రచ్చ రచ్చే చేశారు. మంగళవారం ఓ రెస్టారెంట్‌కు వచ్చిన నలుగురు యువకులు బిర్యానీ కావాలని ఆర్డర్‌ ఇచ్చారు. అయితే అర్థరాత్రి సమయం కాబట్టి బిర్యానీ అయిపోయిందని హోటల్‌ మేనేజర్‌ బదులిచ్చాడు. దీంతో వారు గొడవ చేసే పరిస్థితి ఉండటంతో హోటల్‌ యజమాని పర్సవార్‌ చంద్రకాంత్‌ కలుగజేసుకుని హోటల్‌లో మిగిలిన బిర్యానీ ఇచ్చాడు.

అలా ఇవ్వడమే పెద్ద గొడవకు దారి తీసింది. బిర్యానీ లేదని చెప్పవారు ఇప్పుడు ఎలా వచ్చిందని నలుగురు వ్యక్తులు హోటల్‌ యజమానిపై దాడికి దిగారు. అంతేకాదు హోటల్‌లోని అద్దాలు, ఫర్నిచర్స్‌ను ధ్వంసం చేశారు. ఇక వారి గొడవ ఎక్కువ కావడంతో హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బిర్యానీ కోసం దాడికి దిగిన నిందితులు‌ సోమ రవి, సోమ గంగారెడ్డి, సోమ నవీన్, సోమ శ్రీనివాస్ లుగా గుర్తించిన పోలీసులు. సీసీ పుటేజ్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Liquor Shops: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. మద్యం దుకాణాలు బంద్.. ఎందుకో తెలుసా!

Aadhaar History: మీరు ఆధార్‌ ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా చేయండి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో