AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Floods: నేడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. రూట్ మ్యాప్ సిద్ధం..

TS Floods CM KCR Tour: ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టింది.. కానీ జలమయమైన గ్రామాల్లో విషాదం అలుము కుంది.. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టిన వారంతా తిరిగి గ్రామాల్లోకి చేరుకొని తల్లడిల్లి పోతున్నారు.. ఈ నేపథ్యంలో గోదావరి ముంపును పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.

Telangana Floods: నేడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. రూట్ మ్యాప్ సిద్ధం..
Cm Kcr Ts Floods Tour
Surya Kala
|

Updated on: Jul 17, 2022 | 7:03 AM

Share

Telangana Floods: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గోదావరి (Godavari River) ముంపు ముప్పును ప్రత్యక్షంగా వీక్షించేందుకు రంగంలోకి దిగారు. శనివారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయి ముంపు నష్టం వివరాలు తెలుసుకున్నారు..ఆదివారం ఉదయం భద్రాచలంతో పాటు, ములుగు జిల్లా ఏజెన్సీలో పర్యటిస్తారు..ఏటూరునాగారంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు.. సీఎం కేసీఆర్ వెంట cs సోమేశ్ కుమార్, డీజీపీ, cmo కార్యదర్శి స్మితసబర్వాల్, మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పాల్గొంటున్నారు..

గోదావరి చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తాయి.. గోదావరి పరివాహక గ్రామాలు, మండలాలను వరదలు అతలాకుతలం చేశాయి.. ఆ జీవనది మహోగ్ర రూపం దాల్చడంతో వేలాదిమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టారు. వారం రోజుల నుండి గోదావరి వరద ఉదృతి వందలాది గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసి ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రాణనష్టం జరగకుండా నివారించ గలిగింది.

ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టింది.. కానీ జలమయమైన గ్రామాల్లో విషాదం అలుము కుంది.. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టిన వారంతా తిరిగి గ్రామాల్లోకి చేరుకొని తల్లడిల్లి పోతున్నారు.. ఈ నేపథ్యంలో గోదావరి ముంపును పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.

ఇవి కూడా చదవండి

శనివారం రాత్రి హనుమకొండ కు చేరుకున్న కేసీఆర్.. హంటర్ రోడ్ లోని కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస్ చేశారు.. అంతకంటే ముందు జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధుల తో భేటీ అయ్యారు..

ఈరోజు ఉదయం భద్రాచలం లో ముంపు ప్రాంతాలను సందర్శిస్తారు.. 7.45 నిమిషాలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుండి హెలికాప్టర్ లో బయలుదేరుతారు.. భద్రాచలంలో గోదావరి వరదలు పరిశీలించిన అనంతరం అదే హెలికాప్టర్ లో ములుగు జిల్లాకు చేరుకుంటారు.. గోదావరి ముంపు గురైన ఏటూరునాగారం మండలం లోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలిస్తారు. ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని ITDAలో అధికారులు, ప్రజాప్రతినిధుల తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, cmo కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొంటారు..

సమీక్ష అనంతరం గోదావరి ముంపు నష్టంపై ఒక అంచనాకు వచ్చి ముంపు బాధితులను ఆదుకోవడం పై ప్రకటన చేస్తారు..ఐతే కేసీఆర్ పర్యటన అంతా హెలికాప్టర్ ప్రయాణం రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.. వాతావరణం అనుకూలించక పోతే రోడ్డుమార్గంలో ఏటూరునాగారంకు చేరుకుంటారు..అక్కడే ముంపు గ్రామాలను సందర్శించి సమీక్ష నిర్వహిస్తారు.. సీఎం పర్యటన అంతా గోదావరి పరివాహక ప్రాంతంలో పూర్తిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..