AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Floods: గవర్నర్ తమిళ సై భద్రాచలం పర్యటనలో మార్పు.. కేవలం అశ్వాపురం ముంపు ప్రాంతాలకే పరిమితం

అశ్వాపురం మండలం లోని గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో మాత్రమే గవర్నర్ పర్యటించనున్నారు. ముంపు ప్రాంతాలోని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.

Telangana Floods: గవర్నర్ తమిళ సై భద్రాచలం పర్యటనలో మార్పు.. కేవలం అశ్వాపురం ముంపు ప్రాంతాలకే పరిమితం
Tamili Sai Telangana Tour
Surya Kala
|

Updated on: Jul 17, 2022 | 7:31 AM

Share

Telangana Floods Governor Tour: వరదప్రాంతాల్లో పోటాపోటీగా టూర్‌ప్లాన్‌ చేశారు సీఎం కేసీఆర్ (CM KCR), గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai Soundararajan). ఒకేరోజు సాగనున్న ఇద్దరి పర్యటన రాజకీయంగా కాకరేపుతోంది. అయితే గవర్నర్ తమిళి సై భద్రాచలం వరద ముంపు పర్యటనలో మార్పు చోటు చేసుకున్నాయి.. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలానికే మాత్రమే గవర్నర్ పర్యటన పరిమితమైనట్లు తెలుస్తోంది. అశ్వాపురం మండలం లోని గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో మాత్రమే గవర్నర్ పర్యటించనున్నారు. ముంపు ప్రాంతాలోని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అశ్వాపురంలో గవర్నర్ తన పర్యటన ముగించుకొని రాత్రికి ట్రైన్ లో మణుగూరు నుండి సికింద్రాబాద్ కు చేరుకోనున్నారు.

మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి ట్రెయిన్‌లో బయలుదేరిన గవర్నర్‌.. ఆమె వెంట రెడ్‌క్రాస్‌, మెడికల్‌ సిబ్బందిని సైతం తీసుకెళ్లారు. తన పర్యటనపై వస్తున్న రూమర్లను ఖండించారు గవర్నర్. తన టూర్‌ ఎవరికీ పోటీకాదని.. తాను వరద బాధితులను చూసి చలించిపోయానని.. కేవలం వరదబాధితులను కలిసి సాయం చేయడమే లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు. వరద బాధితులకు నైతకంగా అండగా నిలిచేందుకు.. తీవ్రంగా నష్టపోయిన గిరిజనులకు ధైర్యం చెప్పేందుకు వెళ్తున్నట్లు స్పష్టంచేశారు. తన పర్యటన వెనుక ఎలాంటి ఇతర ఉద్దేశ్యాలు లేవని.. కేవలం వరదబాధితులను ఓదార్చడమే లక్ష్యమంటున్నారు గవర్నర్‌ తమిళిసై.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..