CM KCR: ‘కత్తి ఆంధ్రావాళ్ళదైతే పొడిచేది తెలంగాణ వాళ్లే’.. జగిత్యాల సభలో కాంగ్రెస్‌పై మండిపడ్డ కేసీఆర్
తెలంగాణ ఎన్నికల వేళ జగిత్యాల ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మంచి ఏ రోజైనా మంచే అయితది, చెడు ఎప్పటికైనా చెడే అవుతదన్నారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నప్పటికీ అవసరమైనంత పరిణతి రాలేదన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు ఆగమాగం కాకండని ధైర్యాన్నిచ్చారు. నియోజకవర్గంలో ఎవరినైతే గెలిపిస్తారో రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.
తెలంగాణ ఎన్నికల వేళ జగిత్యాల ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మంచి ఏ రోజైనా మంచే అయితది, చెడు ఎప్పటికైనా చెడే అవుతదన్నారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నప్పటికీ అవసరమైనంత పరిణితి రాలేదన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు ఆగమాగం కావొద్దని ధైర్యాన్నిచ్చారు. నియోజకవర్గంలో ఎవరినైతే గెలిపిస్తారో రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ప్రజలు జాగ్రత్తగా అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలన్నారు. సమాజం, పేద ప్రజల పట్ల అభ్యర్థులకు ఉన్న పరిజ్ఞానాన్ని చూసి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. తెలంగాణ సాధించడం కోసం పుట్టిన జెండా గులాబీ జెండా అన్నారు.
కాంగ్రెస్ 50ఏళ్ల పాలనకు, బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనకు తేడా ఏంటో ఒకసారి గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అంటూ గతాన్ని గుర్తుచేశారు. కరెంట్, మంచి నీళ్లు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. దుబాయ్ వంటి దేశాలకు వలసలు పోయి బ్రతికామన్నారు. చేనేత కార్మికులు, రైతులు ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్‌ను నమ్మి పొత్తు పెట్టుకున్నాం. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇచ్చేందుకు సహకరించలేదు. తెలంగాణను ఆంధ్రావాళ్ల కంటే కూడా కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా ముంచిందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ అప్పట్లో గట్టిగా నిలబడి ఉంటే మనకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని హితవుపలికారు.
కాలువల్లో బురద కూడా లేని పరిస్థితి నుంచి నేడు నిండు కుండలా నీళ్లు నిండిన పరిస్థితి కనిపింస్తోందన్నారు. రైతులు మోటార్లు పెట్టుకుంటే వాటిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లేవాళ్లని కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. వరద కాలువలకు నాలుగు తూములు పెట్టి పంట పొలాలకు నీళ్లు అందించే గతి కూడా లేదన్నారు. కానీ నేడు సస్యశ్యామలంతో తెలంగాణ పచ్చగా ఉందన్నారు. కత్తి ఆంధ్రవాళ్ళదైతే పొడిచేది తెలంగాణ వాళ్లే అంటూ తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలను విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మెదపని కారణంగా దాదాపు 6దశాబ్దాలు తెలంగాణ వెనుకబాటుకు గురైందన్నారు.
కాంగ్రెస్ పార్టీది అవకాశవాదమని చురకలంటించారు. ఓట్లు ఎప్పుడు కులాలకు, మతాలకు అతీతంగా ఒకే కేంద్ర బిందువుగా వేయాలన్నారు. సమాజంలో అందరూ సమానమే అని చెప్పారు. గోదావరి పక్కనే ఉన్నప్పటికీ మంచి నీళ్ల కోసం అనేక కష్టాలను ఎదుర్కొన్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రతి ఇంటికి నాళా ద్వారా తాగునీరు అందిస్తున్న ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరిన్ని అభివృద్ది సంక్షేమాలను అందిస్తూ ముందుకెళ్తామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..