Ugadi 2022: మన స్వప్నం.. బంగారు తెలంగాణ సాధన..తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్‌’నామ సంవత్సరం.. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు(CM KCR) ఆశాభావం వ్యక్తం చేశారు.

Ugadi 2022: మన స్వప్నం.. బంగారు తెలంగాణ సాధన..తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 02, 2022 | 12:45 PM

పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్‌’నామ సంవత్సరం.. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు(CM KCR) ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని మరోసారి పిలుపునిచ్చారు. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతు, దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగినప్పుడు అనేక అనుమానాలు ఉండేవన్నారు. అనేక పోరాటాలు చేసి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. అన్నీ అధిగమించి ప్రగతి పథంలో ఇప్పడు మనం నడుస్తున్నామన్నారు.

రాష్ట్ర ఆదాయం ఏటా పెరుగుతూనే ఉందని చెప్పారు. విద్య, విద్యుత్‌, తలసరి ఆదాయంలో మంచి ఫలితాలు సాధించామన్నారు. మనందరి సామూహిక స్వప్నం.. బంగారు తెలంగాణ సాధన అని గుర్తు చేశారు. తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని, రాష్ట్రంలోని మారుమూల గ్రామంలోనూ భూమి ధర పెరిగిందన్నారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వల్లే భూముల ధరలు పెరిగాయన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని వెల్లడించారు. కులం, మతం, జాతి వివక్ష లేకుండా ముందుకువెళ్తున్నామని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు సీఎం కేసీఆర్.

ఇవి కూడా చదవండి: Diabetes Diet: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే మీ ఆహారంలో ఈ పండును చేర్చుకోండి..

Skin Care Tips: వేసవి కాలంలో మెరిసిపోయే అందం మీ సొంతం కావాలంటే.. ఇంట్లోనే ఇలా చేయండి..