Diabetes Diet: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే మీ ఆహారంలో ఈ పండును చేర్చుకోండి..

Diabetes Control Food: అల్లనేరేడు పండు పుల్లని-తీపి రుచి వేసవిలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా అనేక వ్యాధులను నయం చేసే గుణం ఇందులో ఉంది. దీన్ని తినడం వల్ల..

Diabetes Diet: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే మీ ఆహారంలో ఈ పండును చేర్చుకోండి..
Black Plum
Follow us

|

Updated on: Apr 02, 2022 | 11:02 AM

అల్లనేరేడు పండు(Black Plum) పుల్లని-తీపి రుచి వేసవిలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా అనేక వ్యాధులను నయం చేసే గుణం ఇందులో ఉంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కొవ్వు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, ఐరన్, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6 పుష్కలంగా బ్లాక్ జామూన్‌లో ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే నేరేడు పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు అవుతుంది. మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా.. షుగర్ నియంత్రణలో ఉంటుంది. అది డయాబెటిస్ ను నియంత్రణలో ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.

నేరేడు తింటే డయాబెటిస్ నియంత్రణ: ఔషధ గుణాలు అధికంగా ఉన్న నేరేడు అనేక వ్యాధులకు చికిత్స చేస్తుంది. ఇందులో జాంబోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడుతుంది. జామున్ ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్లు C, B6 స్టోర్హౌస్. సమ్మర్ డైట్ లో ఈ పండును తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

టైప్ 2 డయాబెటిస్‌లో ప్రభావవంతంగా ఉంటుంది: టైప్ 2 డయాబెటిస్ లక్షణాలను నయం చేస్తుంది. మధుమేహం తరచుగా మూత్రవిసర్జన, దాహం కలిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు జామున్ తింటే, మధుమేహం లక్షణాలు తగ్గుతాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణంగా ఉంచుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ రాకుండా కూడా నిరోధించవచ్చు.

జామున్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది: విటమిన్ సి, ఐరన్‌తో కూడిన జామూన్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఈ పండులో ఉండే ఇనుము రక్తాన్ని శుద్ధి చేస్తుంది. హిమోగ్లోబిన్ అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: పొటాషియం సమృద్ధిగా ఉన్న జామూన్, ధమనుల సంరక్షణ ద్వారా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

నొప్పిని నయం చేస్తుంది : కడుపునొప్పి, కీళ్లనొప్పులకు జామున్ ఉత్తమమైన ఇంటి నివారణలలో ఒకటి. ఈ పండు విరేచనాలు, అపానవాయువు వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

జామున్ ఎలా ఉపయోగించాలి: నేరేడు అటువంటి పండు, కడిగిన తర్వాత నేరుగా తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని రసాన్ని తయారు చేసి కూడా తాగవచ్చు. నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేసి వాడితే షుగర్ కంట్రోల్ ఉంటుంది. నేరేడు చెట్టు బెరడును కషాయం చేసి తాగితే కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి. మీరు నేరేడు రసం తయారు చేయడం ద్వారా కూడా జామున్‌ను ఉపయోగించవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: INDIA STRATEGY: అమెరికా బెదిరింపులకు జడవని భారత్.. అక్కసు కక్కుతూనే అభినందించిన ఇమ్రాన్.. ఇది కదా దౌత్య నీతంటే..!

Megha Group: హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా గ్రూప్.. డ్రిల్‌మెక్‌చే ఇడ్రోజెన స్టార్ట్‌అప్‌ ప్రారంభం

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!