CM KCR: “ఆ పథకానికి రూపాయి ఇచ్చినట్టు నిరూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తా”

తెలంగాణ సీఎం కేసీఆర్ నవంబర్ 8న మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పారని పేర్కొన్నారు.

CM KCR: ఆ పథకానికి రూపాయి ఇచ్చినట్టు నిరూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తా
Telangana Cm
Follow us

|

Updated on: Nov 08, 2021 | 4:48 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ నవంబర్ 8న మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పారని పేర్కొన్నారు. ప్రశ్నించిన వాళ్లందర్ని దేశద్రోహులా బీజేపీ చిత్రకరిస్తుందని తెలిపారు. దేశం దురాక్రమణకు గురవుతుందని చెప్తే.. దోశద్రోహులు, అర్భర్ నక్సలైట్లు అని ముద్రవేస్తున్నారని పేర్కొన్నారు. రైతు చట్టాలను బీజేపీ రద్దు చేస్తుందా.. లేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. రాజకీయాలు అవసరమయినప్పుడల్లా ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయడం బీజేపీ అలవాటన్నారు. వడ్లు కొనుగోలు చేస్తారో, లేదో ఫస్ట్ సమాధానం చెప్పాలన్నారు. యాసంగిలో వడ్లు వేయాలని బండి సంజయ్ చెప్పిన మాట తప్పా? కాదా? అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో పండే వరి చూపించేందుకు 6 హెలికాప్టర్లు పెడతానన్నారు. హెలికాప్టర్లలో వెళ్లి వరి చూసేందుకు బండి సంజయ్, కేంద్ర ప్రతినిధులు రావాలన్నారు.

అప్పటివరకు వదిలిపెట్టం…

సాగు చట్టాలపై మాట్లాడిన బీజేపీ నేత వరుణ్‌ గాంధీ కూడా దేశద్రోహేనా అని కేసీఆర్ ప్రశ్నించారు. తాను చైనాలో డబ్బు దాచుకున్నారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం ఎంత కొంటారో కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటుందా.. కొనదా..? తేల్చిచెప్పండి అని ప్రశ్నించారు. తనకు సమాధానం కావాలని…. సమాధానం చెప్పేవరకు బీజేపీని వదిలిపెట్టమని తేల్చి చెప్పారు.

అది నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా

గొర్రెల పథకానికి కేంద్రం నుంచి రూపాయి ఇచ్చినట్లు చూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గొర్రెల పథకం ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నారని సీఎం ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రజల తీర్పుతో గెలిచిన పార్టీ అని.. కర్నాటక, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాలను కూలదోసి అప్రజాస్వామికంగా బీజేపీ రూల్ చేస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రశ్నిస్తే తొలుత దేశద్రోహులు అని ముద్రవేయడం, ఆ తర్వాత ఐటీ, ఈడీ సంస్థలతో దాడులు చేయడం బీజేపీకి అలవాటన్నారు. పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరని.. బండి  సంజయ్ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సీఎం వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రానికి దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయకపోవడానికి కారణాలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత కూడా ప్రజలు తన నిర్ణయాన్ని గెలిపించి.. రెండోసారి గెలిపించారని కేసీఆర్ తెలిపారు.

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ సాధించిన పురోగతి.. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ సాధించాయని కేసీఆర్ ప్రశ్నించారు. కరోనా వచ్చి ఇబ్బందులు ఎదురవుతుంటే.. ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి సాయం చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ చెప్పారు.

Also Read: Viral video: ముంగిస, నాగుపాము మధ్య భీకర యుద్ధం.. చూస్తే గుండెలు హడల్