AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేంద్రంపై యుద్ధం.. వచ్చే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. రైతులకు సీఎం కేసీఆర్ పిలుపు

తెలంగాణలో పండే ధాన్యాన్ని పూర్తిగా కొనేవరకు వదిలిపెట్టమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Telangana: కేంద్రంపై యుద్ధం.. వచ్చే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. రైతులకు సీఎం కేసీఆర్ పిలుపు
Cm Kcr Comments
Ram Naramaneni
|

Updated on: Nov 08, 2021 | 5:25 PM

Share

తెలంగాణలో పండే ధాన్యాన్ని పూర్తిగా కొనేవరకు వదిలిపెట్టమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంపై యుద్దానికి సీఎం యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. రైతులతో కలిసి ధర్నాలకు పిలుపునిచ్చారు. వచ్చే శుక్రవారం అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు సీఎం పిలుపునిచ్చారు. రైతులు వేలాదిగా తరలి రావాలని కోరారు. బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించినా.. ధాన్యం కొంటారో, లేదో నిలదీయాలన్నారు. సీలేరు ప్రాజెక్టు ఆంధ్రాకు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలకు ప్రధాని తీవ్ర అన్యాయం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘నాతో కలిసి ధర్మాకు కూర్చుంటావా’ అంటూ బండి సంజయ్ సీఎంను ప్రశ్నించారు.  ఇకపై కేంద్రాన్ని వదిలిపెట్టమని.. వెంటాడతాం, వేటాడతాం.. ఎక్కడిదాకా అయినా పోతాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. పంజాబ్‌లో ధాన్యం కొంటున్నట్లు.. తెలంగాణలో కొంటారో, లేదో తేల్చి చెప్పాలన్నారు. ప్రపంచంలో పెద్ద సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తెలంగాణలో ఉన్నాయని.. సీడ్ కంపెనీతో టై అప్ ఉన్న రైతులు ధాన్యం వేసుకోవచ్చని సీఎం చెప్పారు. మిల్లర్లు, వ్యాపారుస్తుల నుంచి హామి ఉన్న రైతులు, ఒక రూపాయి తక్కువకైనా అమ్ముకుంటాం అనుకున్నవారు కూడా పంట వేసుకోవచ్చన్నారు.

బీజేపీ నేతల కథ తేల్చేదాకా రోజూ మాట్లాడతానని… తన మీడియా సమావేశం ఇకపై రోజూ ఉంటుందని స్పష్టం చేశారు.  డీజిల్ మీద, పెట్రోల్ మీద సెస్ కేంద్ర విత్ డ్రా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం చేసి.. ఏమైనా కేసులు పెట్టాలనుకున్నా.. తాము దేనికీ భయపడమని సీఎం స్పష్టం చేశారు.  రాష్ట్రంలో హనుమాన్‌ గుడి లేని ఊరు.. టీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని సీఎం అన్నారు.

Also Read: CM KCR: “ఆ పథకానికి రూపాయి ఇచ్చినట్టు నిరూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తా”

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌