CM KCR: ‘దళితుల భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నాం’.. ఎంపీటీసీ భర్తతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆడియో వైరల్

CM KCR Audio Viral: తెలంగాణ అంతటా హుజూరాబాద్‌ ఉపఎన్నిక వేడి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సైతం.. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి చిన్న స్థాయి

CM KCR: ‘దళితుల భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నాం’.. ఎంపీటీసీ భర్తతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆడియో వైరల్
Kcr
Follow us

|

Updated on: Jul 24, 2021 | 6:59 PM

CM KCR Audio Viral: తెలంగాణ అంతటా హుజూరాబాద్‌ ఉపఎన్నిక వేడి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సైతం.. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి చిన్న స్థాయి నేతలతో మాట్లాడుతున్నారు. తాజాగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం తనగుల గ్రామానికి చెందిన ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకువస్తున్న దళిత బంధు పథకం గురించి కేసీఆర్ రామస్వామితో మాట్లాడారు. హుజురాబాద్‌తో దళిత బంధు గురించి అన్ని గ్రామాలకు తెలియాలని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పథకమని కేసీఆర్ రామస్వామికి పలు సూచనలు చేశారు. దళితుల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నామని.. కొంతమంది చెప్పే మాటలను నమ్మకండి అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.

ఇలాంటి పథకం ఎక్కడా లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ రామస్వామికి సూచించారు. హుజురాబాద్‌లో ప్రతి గ్రామానికి ఈ పథకం గురించి తెలియాలన్నారు. ఈ నెల 26న హుజురాబాద్‌కు చెందిన దళితులందరూ కలిసి ప్రగతిభవన్‌కు రావాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. ప్రతి గ్రామం నుంచి ఇద్దరు మహిళలు, పురుషులు ఉంటారని పేర్కొన్నారు. ఆ ఒక్క రోజు మొత్తం దళిత బంధు గురించి చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై అందరికీ అవగాహన కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాకతీ కేసీఆర్ వెల్లడించారు. దళిత జాతి గొప్పదని, వారి అభివృద్ధికి కృషి చేస్తానని కేసీఆర్ తెలిపారు. వైరల్ ఆడియో.. కోసం ఈ లింకును క్లిక్ చేయండి.. 

CM KCR Audio Viral

Also Read:

Huzurabad By Election: హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌దే గెలుపు.. సంచలన కామెంట్స్ చేసిన బండి సంజయ్..

KTR Birthday: హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా!.. రేర్ పొటోతో కేటీఆర్‌కు కవిత జన్మదిన శుభాకాంక్షలు