AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం.. ఎకరానికి రూ.10 వేల చొప్పున ప్రకటించిన సీఎం కేసీఆర్‌

వడగళ్ల వానతో పంటనష్ట పోయిన రైతులకు ఊరట కలిగిస్తూ ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎకరానికి 10 వేల సాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 లక్షల 28 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వెల్లడించారు .

CM KCR: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం.. ఎకరానికి రూ.10 వేల చొప్పున ప్రకటించిన సీఎం కేసీఆర్‌
Cm Kcr
Basha Shek
|

Updated on: Mar 23, 2023 | 1:53 PM

Share

వడగళ్ల వానతో పంటనష్ట పోయిన రైతులకు ఊరట కలిగిస్తూ ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎకరానికి 10 వేల సాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 లక్షల 28 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వెల్లడించారు . పరిహారం కోసం మొత్తం రూ. 228 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. కౌలు రైతులకు కూడా సాయం అందేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. పంట నష్టంపై కేంద్రానికి ఎలాంటి నివేదికా పంపడం లేదన్నారు సీఎం కేసీఆర్. గతంలోనూ రిపోర్టులు పంపినా పైసా సాయం చేయలేదని విమర్శించారు. దేశానికి కొత్త అగ్రికల్చర్ పాలసీ అవసరం ఉందన్నారు CM కేసీఆర్. కేంద్రం తీరు కేంద్రం తీరు చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే ఉందని విమర్శించారు. రాజకీయాలే తప్ప రైతులు, ప్రజల గురించి ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,22,258 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న ఎక్కువగా నష్టం జరిగింది. రైతులకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయం దండగ అని కొందరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. జీఎస్‌డీపీలో వ్యవసాయం రంగం పాత్ర ఉంది. తెలంగాణ లో 56 లక్షల ఎకరాలు వరి ఉంది. పంట కోల్పోయిన రైతులు నిరాశ పడవద్దు.. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పాలసీ లు సరిగా లేవు. ఇపుడు ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఏమి చెప్పినా వృథా. కేంద్ర బృందం ఎపుడు వస్తుందో తెలియదు..దొంగలు పడ్డ ఆరునెలలకు వస్తారు. కేంద్రానికి నివేదిక పంపాలని మేము అనుకోవడం లేదు’

‘రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇటీవల కురిసిన వర్షాల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల పరిహారం ప్రకటిస్తున్నాం. కౌలు రైతులకు పరిహారం అందే విధంగా ఆదేశాలు ఇస్తున్నాం. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందవద్దు.. ధైర్యం గా ఉండండి. అన్ని పంటలకు పదివేల పరిహారం ఇస్తాం’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌