AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: దేశ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి.. క్రిస్మస్ వేడుకల్లో కోరిన సీఎం కేసీఆర్

జై భారత్‌ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం క్రిస్మస్‌ సందర్భంలో అంకితమవుదామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం కేసీఆర్ కేక్ కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

CM KCR: దేశ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి.. క్రిస్మస్ వేడుకల్లో కోరిన సీఎం కేసీఆర్
CM KCR Cake Cutting
Sanjay Kasula
|

Updated on: Dec 21, 2022 | 9:30 PM

Share

దేశ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ను ప్రతీ ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జై భారత్‌ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం క్రిస్మస్‌ సందర్భంగా అంకితమవుదామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 20 ఏళ్ల క్రితం “జై తెలంగాణ” నినాదంతో యుద్ధాన్ని ప్రారంభించామన్నారు. చివరికి విజయం సాధించామన్నారు. విజయ పరంపరలో భాగంగా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో చూస్తున్నామన్నారు. ఏడేళ్ల క్రితం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్ష ఉండేది. ఇవాళ.. రూ.2.75లక్షలు. ఒక మంచి కోసం జరిగే ప్రయత్నంలో అందరం భాగస్వామ్యం కావాలన్నారు.

తెలంగాణ సాధించిన పురోగతి దేశంలోని అన్ని రాష్ట్రాలలో.. అన్ని ప్రాంతాల్లో కూడా రావాలన్నారు. అందుకోసం మరో కొత్త యుద్ధానికి శంఖం పూరించామన్నారు. తెలంగాణ మాదిరిగా భారతదేశం అన్ని రకాలుగా పురోగమించి.. ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా పురోగమించే దిశగా మనకు విజయం చేకూరాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

జై తెలంగాణ నినాదంతో తెలంగాణ సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగామో.. జై భారత్‌ నినాదంతో మనందరం పురోగమించి అద్భుతమైన భారతావని నిర్మాణం కోసం క్రిస్మస్‌ సందర్భంలో అంకితమవుదామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

క్రీస్తు బోధనలు తప్పకుండా ఆచరిస్తే ఈ ప్రపంచంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్థం, ఇతరుల పట్ల అసహనం ఉండవన్నారు. ప్రపంచంలో యుద్ధాలే జరగవని.. నేరస్థుల కోసం జైళ్లే అవసరముండదన్నారు. యేసు క్రీస్తు కలలుగన్న ప్రపంచం.. ఎంతో ఉదాత్తమైన మానవ ప్రపంచమని తెలిపారు.

తనను తాను ప్రేమించినట్లే పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పిన మాటల ఆయన గుర్తు చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమించినా.. క్రీస్తు బోధనలు అనుసరణీయం. సంతోషకర సమాజం కోసం క్రీస్తుతో పాటు మరెందరో మహానుభావులు కృషి చేశారు. క్రీస్తు బోధనలు అందరూ పాటించి సంతోషకర జీవితాన్ని గడపాలన్నారు.

సీఎం కేసీఆర్‌తో పాటు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, క్రైస్తవ మత పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు కూడా హాజరయ్యారు. క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. కేక్‌ కట్‌ చేసి గిఫ్ట్‌లు అందజేశారు. సందర్భం వేరయినా.. దేశ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ను ప్రతీ ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు సీఎం కేసీఆర్‌.