Chandrababu: హైదరాబాద్ అభివృద్ధికి నాంది పలికానన్న చంద్రబాబు.. తెలుగు రాష్ట్ర అభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్ష..
టీడీపీ శంఖారావం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీలో గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెట్టి వారిని..
తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఎక్కడుందని అడిగినవారికి ఇదిగో సమాధానమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చూపించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ మైదానంలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉంది. నేను ఫౌండేషన్ వేయకపోతే హైదరాబాద్ ఇంత అభివృద్ధి అయ్యేదా.. అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీని క్రియాశీలకంగా చేయాలని కోరారు. వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలు తిరిగి రావాలని ఆహ్వానించారు. తెలంగాణలో కూడా బలంగా ఉండాల్సిన అవసరముందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
టీడీపీ ఎక్కడ అనే వారికి ఇవాళ ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఉత్సాహమే సమాధానం ఇచ్చారని అన్నారు. రెండు రాష్ట్రాలు అయ్యాయి కాబట్టి కొందరు చేతకాని వ్యక్తులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపేస్తారంట.
బుద్ధి, జ్ఞానం ఉండేవాళ్లు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఎవరూ లేరు.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండటం కూడా రికార్డే.. రాబోయే రోజుల్లో నా రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేరు. ఎందుకంటే మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు.
నన్ను 40 ఏళ్లు ఆశీర్వదించిన తెలుగు జాతికోసం జీవితాంతం పనిచేస్తానంటూ అన్నారు. ఏపీలో గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెట్టి వారిని ఆదుకునే బాధ్యత నాదే. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తానంటూ హామీ ఇచ్చారు. జ్ఞానేశ్వర్ వంటి నాయకులను అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం